ETV Bharat / state

'కేసీఆర్​ జాతీయ పార్టీ అనగానే.. ఆ రెండు పార్టీలకు వణుకు మొదలైంది' - Balka Suman latest news

BALKA SUMAN: భాజపా, కాంగ్రెస్​ పార్టీలపై ప్రభుత్వ విప్​ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.​ ఆ రెండూ.. భారత జాతికి ద్రోహం చేసిన పార్టీలుగా​ అభివర్ణించారు. భాజపా, కాంగ్రెస్​ పార్టీల నేతలు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్‌ కొత్త జాతీయ పార్టీ అనగానే ఆ పార్టీల నేతలకు వణుకు మొదలైందని ధ్వజమెత్తారు.

'కేసీఆర్​ జాతీయ పార్టీ అనగానే.. ఆ రెండు పార్టీలకు వణుకు మొదలైంది'

author img

By

Published : Jun 12, 2022, 3:46 PM IST

Updated : Jun 12, 2022, 5:18 PM IST

'కేసీఆర్​ జాతీయ పార్టీ అనగానే.. ఆ రెండు పార్టీలకు వణుకు మొదలైంది'

BALKA SUMAN: కేసీఆర్‌ కొత్త జాతీయ పార్టీ అనగానే కాంగ్రెస్‌, భాజపాలకు వణుకు మొదలైందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ధ్వజమెత్తారు. జాతీయ పార్టీలపై తమ పార్టీలో చర్చ పెడితే.. ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీలు దండే విఠల్‌, భాను ప్రసాద్‌లతో కలిసి బాల్క సుమన్ మాట్లాడారు. భాజపా, కాంగ్రెస్​ పార్టీలు భారత జాతికి ద్రోహం చేసిన పార్టీలుగా బాల్క సుమన్ అభివర్ణించారు. కేసీఆర్‌ కాలం చెల్లిన మెడిసిన్ కాదని.. ప్రాణం పోసే సంజీవని అని తెలిపారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షురాలికి ఈడీ నోటీసులు ఇస్తే.. కాంగ్రెస్‌ పార్టీ ధీటుగా పోరాడటం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కొన ఊపిరితో ఉందన్న ఆయన.. కాంగ్రెస్​ది అంతిమ యాత్ర.. తెరాసది జైత్రయాత్రగా పేర్కొన్నారు.

పద్ధతి మార్చుకోవాలి..: భాజపా ఉన్మాదాన్ని, దుర్మార్గాలను దేశ ప్రజల ముందు పెడతామని బాల్క సుమన్​ హెచ్చరించారు. భాజపా, కాంగ్రెస్​ పార్టీల నేతలు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ డిమాండ్లకు కేంద్రం ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్​ కొత్త జాతీయ పార్టీ అనగానే కాంగ్రెస్​, భాజపాలకు వణుకు మొదలైంది. జాతీయ పార్టీపై మా పార్టీలో చర్చ పెడితే.. ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. భాజపా ఉన్మాదాన్ని, కాంగ్రెస్ దుర్మార్గాలను దేశ ప్రజల ముందు పెడతాం. ఆ రెండు పార్టీల నేతలు పద్ధతి మార్చుకోవాలి.-బాల్క సుమన్​, ప్రభుత్వ విప్

నియంత పాలన..: రాష్ట్ర ఆర్థిక అంశాలపై కేంద్రం.. కావాలనే ఇబ్బందులకు గురి చేస్తుందని ఎమ్మెల్సీ భాను ప్రసాద్​ ఆరోపించారు. దేశంలో ఓ నియంత పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు. దేశ భవిష్యత్‌ కోసం సీఎం కేసీఆర్.. కొత్త అజెండాతో ముందుకు వస్తున్నారని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి...
కేసీఆర్​కు దీదీ ఫోన్.. జాతీయ పార్టీపై ఏమన్నారంటే..!

జాతీయ పార్టీకి కేసీఆర్​ కార్యచరణ.. తెరాస పేరు మార్పుపై త్వరలో తీర్మానం

Last Updated : Jun 12, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.