ETV Bharat / state

Hyderabad Metrorail losses: కరోనా నష్టాల నుంచి మెట్రోను గట్టెక్కించేదెలా..? - Government reviewing Metro train losses

Hyderabad metro: మెట్రో రైలును నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తగ్గిన ఆదాయం, పేరుకుపోతున్న వడ్డీల నేపథ్యంలో తగిన తోడ్పాటు అందించి ఆదుకోవాలన్న ఎల్​అండ్​టీ సంస్థ విజ్ఞప్తిని (L&T appeal the government to reduce metro losses) అన్ని రకాలుగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఓమారు సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించిన మంత్రుల కమిటీ.. సంస్థ ప్రతినిధులతో మరోమారు చర్చించాలని అధికారులను ఆదేశించింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత నష్టాల నుంచి గట్టెక్కించడంతో పాటు ధీర్ఘకాలిక వ్యూహంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.

Hyderabad Metro rail in Loss, నష్టాల్లో మెట్రో రైలు
Metro rail
author img

By

Published : Nov 28, 2021, 2:47 PM IST

నష్టాల నుంచి మెట్రోను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం

కరోనా మహమ్మారి హైదరాబాద్ మెట్రోకు శాపంగా మారింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు ప్రజల ఆదరణ క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. వివిధ సందర్భాల్లో రికార్డుస్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఎంతో సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad metro rail news) పేరు గాంచింది. అయితే కరోనా మహమ్మారి మెట్రోను దారుణంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్, వివిధ రంగాల కార్యకలాపాలు మందగించడం, వర్క్ ఫ్రం హోం తదితర కారణాల వల్ల ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. మెట్రో తిరిగి ప్రారంభమైనా ఆశించిన మేర ప్రయాణికుల సంఖ్య పెరగలేదు.

ఆర్థిక నష్టాలు.. పేరుకుపోతున్న అప్పులు

మెట్రో ఎదుర్కొంటున్న నష్టాల నుంచి గట్టెక్కించాలని ఎల్​అండ్​టీ సంస్థ ఎప్పట్నుంచో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. పలు దఫాలుగా సర్కారుకు విజ్ఞప్తులు(L&T appeal the government to reduce metro losses) చేసింది. కొవిడ్ మూలంగా వచ్చిన ఆర్థికనష్టాలు, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీలను దృష్టిలో ఉంచుకొని తగిన తోడ్పాటు అందించాలని కోరింది. సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రిని కలిసిన సంస్థ ప్రతినిధులు ఆర్థిక నష్టాలు, అప్పుల భారం, వడ్డీ చెల్లింపులు తదితరాలను వివరించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అన్ని రంగాలను ఆదుకున్న తరహాలోనే హైదరాబాద్ మెట్రోను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తామని (Government reviewing Metro train losses) హామీ ఇచ్చారు.

వెయ్యి కోట్ల సాఫ్ట్​లోన్ అడుగుతున్న ఎల్ అండ్ టీ

నష్టాల నుంచి(Hyderabad metro rail in loss) గట్టెక్కించి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన విధానంపై అధ్యయనం కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో ఇటీవల సమావేశమైన కమిటీ.. మెట్రో నష్టాలు, ఎల్అండ్​టీ విజ్ఞప్తులపై చర్చించింది. ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకు వీలుగా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమేర ఆర్థికసాయం చేయాలని కోరుతున్న ఎల్ అండ్ టీ.. కనీసం వెయ్యి కోట్లను సాఫ్ట్ లోన్ రూపంలో ఇవ్వాలని అడుగుతోంది. పాత రుణాల వడ్డీ రేట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునేలా వెసులుబాటు కల్పించాలని కోరుతోంది.

దీర్ఘకాలిక ఫలితాలపై దృష్టి..

ఎల్‌ అండ్‌ టీ విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. మరోమారు సంస్థ ప్రతినిధులతో చర్చించాలని(Hyderabad Metro rail news) సూచించారు. ఛార్జీలు, పన్నుల మినహాయింపు వల్ల ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని.. లీజు, మార్ట్‌గేజ్ లాంటి నిబంధనల మార్పు విషయంలో అన్ని రకాలుగా ఆలోచించాల్సి ఉంటుందని అంటున్నారు. ఆర్థికసాయం కూడా ఏ మేరకు సాధ్యమన్న విషయమై ప్రభుత్వం అన్ని అంశాలు పరిశీలిస్తోంది. తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలిక ఫలితాలు దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

ఇదీ చదవండి: Father Brutally Beats Son Hyderabad : కొడుకును చితకబాదుతూ.. కుమార్తెతో వీడియో తీయించిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.