ETV Bharat / state

కిడ్నీ రోగులకు సాంత్వన.. కొత్తగా 61 రక్తశుద్ధి కేంద్రాలు..! - Government decision to set up 61 new blood purification centers in the state

కిడ్నీ రోగులకు సాంత్వన కలిగించేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 61 రక్తశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిలో ముందుగా ఐదింటిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేనుంది.

కిడ్నీ రోగులకు సాంత్వన.. కొత్తగా 61 రక్తశుద్ధి కేంద్రాలు..!

author img

By

Published : Apr 15, 2022, 5:15 AM IST

మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు సాంత్వన కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 61 రక్తశుద్ధి కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. వీటి ద్వారా రాష్ట్రంలో మరో 515 డయాలసిస్‌ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అత్యధికంగా ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో డయాలసిస్‌ సేవలు లభ్యమవుతుండగా.. నూతనంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలకూ ఈ సేవలను విస్తరించారు. కొత్తగా మంజూరు చేసిన సెంటర్లలో తొలుత ఐదింటిని యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో ఒక్కో దాంట్లో 5 డయాలసిస్‌ పరికరాల చొప్పున నెలకొల్పనున్నారు. అవి.. 1. కమలానెహ్రూ ప్రాంతీయ ఆసుపత్రి(నాగార్జునసాగర్‌) 2. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి(సిద్దిపేట), 3. హుస్నాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం(సిద్దిపేట) 4. ధర్మపురి ప్రాంతీయ ఆసుపత్రి(జగిత్యాల) 5. షాద్‌నగర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం(రంగారెడ్డి)ల్లో త్వరలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌కు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీకి ఆదేశాలిస్తూ వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ వైద్యంలో కేవలం 3 డయాలసిస్‌ కేంద్రాలుండగా.. వీటి సంఖ్య గత ఏడేళ్లలో 45కు పెరిగింది.

10వేల మందికి పైగా బాధితులకు లబ్ధి..

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో రక్తశుద్ధి పొందుతున్న రోగులు సుమారు 10వేల మందికి పైగానే ఉన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు ఖర్చు పెడుతోంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదైన రోగులు ఉచితంగా రక్తశుద్ధి చికిత్సను పొందుతున్నారు. రక్తశుద్ధి చికిత్సలో వినియోగించే ప్లాస్టిక్‌ ట్యూబ్‌, డయలైజర్‌లను ప్రతిసారీ తప్పనిసరిగా మార్చాలన్న నిబంధనలను కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మార్పు వల్ల హెచ్‌ఐవీ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించకుండా అడ్డుకున్నట్లు అవుతుంది. ఇలాంటి విధానాన్ని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ 45 లక్షలకు పైగా డయాలసిస్‌లు నిర్వహించారు. ఇందుకోసం రూ.600 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందని వైద్యవర్గాలు తెలిపాయి. డయాలసిస్‌ రోగుల కోసం ప్రభుత్వం ఉచిత బస్‌పాస్‌ సౌకర్యాన్ని కూడా కల్పించింది.

ఇవీ చూడండి..

Minister Ktr On Dalita Bandhu: 'అలా చేస్తే దళితబంధుతో రెట్టింపు సంపద'

'కలెక్టర్​ను కొట్టిన నేతల రాజకీయ జీవితం సూపర్​ హిట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.