ETV Bharat / state

ఎగుమతుల పేరుతో పన్ను ఎగనామం

విదేశాలకు ఎగుమతి పేరుతో అనుమతులు తెచ్చుకుంటారు.. అక్కడికి నాణ్యత లేని ఆభరణాలు పంపిస్తారు.. అసలైనవి దేశీయంగా అధిక ధరలకు అమ్ముకుంటారు. రావిరాల సెజ్ కేంద్రంగా జరుగుతున్న ఈ కుంభకోణంలో ఇప్పటివరకు 1100కిలోల బంగారాన్ని పక్కదారి పట్టించారని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ లెక్క తేల్చింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి... రూ.15కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

author img

By

Published : May 8, 2019, 6:47 PM IST

gold-scam

బంగారు ఆభరణాల రంగంలో వృద్ధి కొరకు ప్రభుత్వం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు సమీపంలోని రావిరాల గ్రామంలో ప్రత్యేకంగా జెమ్స్‌ అండ్‌ జువెలర్స్‌ సెజ్‌ ఏర్పాటు చేశారు. వ్యాపారస్తులు బంగారాన్ని అక్కడికి దిగుమతి చేసుకుని.. ఆభరణాలుగా మార్చి తిరిగి విదేశాలకు ఎగమతులు చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని పెంచాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కాని నిబంధనలను ఉల్లంఘించి దిగుమతి చేసుకున్న బంగారంతో ఆభరణాలను తయారుచేసి స్థానిక మార్కెట్లోకి అక్రమంగా తరలించి ఓ సంస్థ ప్రయోజనం పొందుతోంది.

ఎగుమతి చేయాల్సిన ఆభరణాల స్థానంలో నకిలీ నగలను విదేశాలకు పంపుతోంది. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ తంతుపై డీఆర్‌ఐ అధికారులు నిఘా పెట్టారు. విశ్వసనీయ సమాచారంపై ఈ నెల 3,4,5 తేదీల్లో సెజ్‌లోని ఆ సంస్థలో సోదాలు నిర్వహించారు. ఎగమతికి సిద్ధంగా ఉన్న అభరణాల పార్శిల్‌ పరిశీలించారు. వాస్తవానికి ఆ పార్శిల్‌లోని ఆభరణాల్లో రూ.5.45 కోట్లు విలువైన 19 కిలోలు బంగారం, 2 కిలోల రాళ్లు ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. కాని పార్శిల్‌ను తనిఖీలు చేయగా కేవలం రూ.22.16లక్షలు విలువైన 565గ్రాములు బంగారం, 2 కిలోల చౌకరకం రాళ్లు ఉన్నట్లు తేలింది. వీటివిలువ కేవలం 22లక్షలు మాత్రమే.

దిగుమతి బంగారం దేశీయ మార్కెట్​కు...

దిగుమతి చేసుకుంటున్న బంగారంతో ఆభరణాలు చేస్తున్నప్పటికీ... వాటిని స్థానిక మార్కెట్‌కు మళ్లించి నాసిరకం మాత్రమే ఎగుమతి చేస్తున్నట్లు తేటతెల్లమైంది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని భావించిన అధికారులు సదరు సంస్థలో సోదాలు నిర్వహించారు. సెజ్​లో బంగారు నిల్వల్లోనూ తేడాలు గుర్తించారు. రికార్డులు సీజ్ చేసి 21 కిలోలు బంగారం, 6.8కిలోల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.14.87 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. ఈ సంస్థ ఇప్పటి వరకు 1100 కిలోలు బంగారాన్ని పక్కదారి మళ్లించినట్లుగా గుర్తించిన అధికారులు... ఇందుకు బాధ్యులైన నలుగురిని అరెస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: రూ.14.87 కోట్ల విలువైన బంగారం స్వాధీనం.. నలుగురి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.