ETV Bharat / state

Global Tenders: ఇవాళ కొలిక్కిరానున్న గ్లోబల్ టెండర్ల వ్యవహారం

author img

By

Published : Jun 4, 2021, 5:13 AM IST

కొవిడ్ టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్ల వ్యవహారం ఇవాళ తేలిపోనుంది. బిడ్ల దాఖలుకు నేడు చివరి తేదీ కావడంతో సాంకేతిక బిడ్లను కూడా ఈరోజే తెరవనున్నారు. దేశవ్యాప్తంగా గ్లోబల్ టెండర్ల కోసం స్పందన లేని పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

global
గ్లోబల్ టెండర్ల వ్యవహారం

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు ఇవ్వాలని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం... వివిధ రకాలుగా వాటిని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్‌ల నుంచి కొవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను కొంతమేర కొనుగోళ్లు చేస్తోంది. ఇంకా ఎక్కువ సంఖ్యలో టీకాలు సమీకరించుకునేందుకు వీలుగా ఇప్పటికే గ్లోబల్‌ టెండర్లను పిలిచింది.

ఆరు నెలల్లో కోటి టీకా డోసులు...

ఆరు నెలల్లో కోటి టీకా డోసులను సమకూర్చుకునేందుకు రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ... షార్ట్ టెండర్లను పిలిచింది. నెలకు కనీసం 15 లక్షల డోసులు ఇవ్వాలని షరతు విధించింది. గత నెల 19న టెండర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వగా... 26న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించారు. యూకే (UK)కు చెందిన ఆస్ట్రాజెనికా (Astragenica), రష్యాకు చెందిన స్పుత్నిక్‌-V (Supthinik) సంస్థలు మాత్రమే ప్రీబిడ్ సమావేశానికి హాజరయ్యాయి.

నేటితో గడువు ముగింపు...

ఇతర కంపెనీల తరపున కొందరు డిస్ట్రిబ్యూటర్లు హాజరైనప్పటికీ వారిని పరిగణలోకి తీసుకోబోమని ప్రభుత్వం తెలిపింది. బిడ్ల దాఖలుకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. సాయంత్రం ఆరు గంటల వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. అరగంట తర్వాత ఆరున్నరకు సాంకేతిక బిడ్లను తెరుస్తారు. దాఖలైన బిడ్లలో సాంకేతికపరమైన అర్హతలను పరిశీలిస్తారు. ఆర్థిక బిడ్లను పరిశీలించే తేదీని తర్వాత ప్రకటించనున్నారు.

గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం...

దేశంలోని వివిధ రాష్ట్రాలు సైతం ఇప్పటికే టీకాల కోసం గ్లోబల్ టెండర్లను పిలిచాయి. అయితే వివిధ కారణాల రీత్యా వాటికి స్పందన లభించడం లేదు. తాము కేంద్ర ప్రభుత్వాలకు విక్రయిస్తాం కానీ, రాష్ట్రాలకు ఇవ్వబోమని కొన్ని కంపెనీలు ప్రకటించాయి. ఇతర కారణాలతో మరికొన్ని ముందుకు రావడం లేదు. ఒక్క సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేయలేదని నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకటించింది.

రాష్ట్రాలు కాకుండా కేంద్రమే టీకాలు కొనుగోలు చేయాలని పలువురు ముఖ్యమంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం పిలిచిన గ్లోబల్ టెండర్ల విషయంలో ఇవాళ స్పష్టత రానుంది. అటు బిడ్ల గడువు పొడిగించాలని కూడా రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఇప్పటివరకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని సమాచారం.

ఇవీ చదవండి: RAINS: కష్టాల ఊబిలో కర్షకులు... తడిసిపోయిన ధాన్యం కుప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.