గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ మార్గంలో బీఎస్ఎన్ఎల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
పదోన్నతుల ద్వారా సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అంగీకరించింది. ప్లేయర్ కమ్ కోచ్‌గా ఉన్న మహమ్మద్ రవూఫ్ అలీని.. స్పోర్ట్స్ ఇన్స్‌స్పెక్టర్‌గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. జూనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న కె.జయప్రకాష్‌ను ఎన్నికల విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వినియోగించుకునేందుకు అంగీకరించింది. శానిటరీ జవాన్లకు హెల్త్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు అనుమతి ఇచ్చింది.
ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు గంధం జోత్న్స, ముద్రబోయిన శ్రీనివాసరావు, మీర్ బాసిత్ అలీ, సామ స్వప్న, సున్నం రాజ్‌మోహన్, మహ్మద్ నజీరుద్దీన్, ముఠా పద్మా నరేష్, కొలను లక్ష్మి, వి.సింధు, సబితా కిశోర్, బైరగోని ధనుంజయ భాయ్, ఎ.అరుణ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి