హైదరాబాద్ అమీర్‌పేటలో జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగులను తొలగిస్తున్నారు. నోటీసులు ఇచ్చినా కోచింగ్ కేంద్రాల నిర్వాహకులు స్పందించలేదని అధికారులు తెలిపారు. వానాకాలం దృష్ట్యా వీటిని తొలగిస్తున్నామని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ తెలిపారు. దాదాపు 200 మంది సిబ్బందితో తొలగింపు ప్రక్రియ చేపట్టిన్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: నేటితో పూర్తికానున్న భవనాల అప్పగింతలు