ETV Bharat / state

రాబోయేది వర్షాకాలం... ప్రత్యేక చర్యలు అవసరం...

ఆక్రమణలకు గురైన కాలిబాటలు, నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అడ్వటైజ్​మెంట్ బోర్డుల తొలగింపు, వర్షాలకు ముందే కాలువల శుభ్రత.. ఈ లక్ష్యాలుగా బల్దియా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రాబోయే వర్షాకాలం కోసం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది.

రాబోయేది వర్షాకాలం... ప్రత్యేక చర్యలు అవసరం...
author img

By

Published : Jun 3, 2019, 8:16 PM IST

వర్షాకాలం రానున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంపై జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ ఉన్నతాధికారులు, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటి క‌మిష‌న‌ర్లతో స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. న‌గ‌రంలోని ఫుట్‌పాత్‌ల‌పై అక్రమంగా అడ్వర్​టైజ్​మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి పాదచారుల‌కు తీవ్ర ఇబ్బందులు క‌లుగ‌జేస్తున్నారని... వీట‌న్నింటిని తొల‌గించేందుకు ప్రత్యేక కార్యచరణ చేప‌ట్టాల‌ని దానకిషోర్ అధికారులకు ఆదేశించారు. వారంలోగా తొలగించాలని సూచించారు.

జూన్ రెండో వారంలో వ‌ర్షాలు ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రతి మున్సిప‌ల్ వార్డుకు ఒక వ‌ర్షాకాల‌ ప్రత్యేక బృందాన్ని కేటాయించామ‌ని తెలిపారు. వర్షాలు పడేకంటే ముందే ర‌హ‌దారుల‌పై ప్లాస్టిక్‌, భవన నిర్మాణ వ్యర్థాల‌ను తొల‌గించాలని సూచించారు. ఈనెల 5న ప్రపంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సందర్భంగా వాయు కాలుష్యం అనే నినాదంతో గ్రేటర్​లో పెద్ద ఎత్తున పలు కార్యక్రమాల‌ను నిర్వహించ‌నున్నట్టు దాన‌కిషోర్ తెలిపారు. ముఖ్యంగా చెత్తను, ఎండుటాకుల‌ను త‌గ‌ల‌బెట్టకుండా, వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించేలా పలు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ర‌హ‌దారుల‌పై లేన్ డిస్‌ప్లేను పాటించాల‌న్నారు. న‌గ‌రంలో 1200 రూపాయ‌ల నుంచి ల‌క్ష రూపాయ‌ల లోపు ఆస్తి ప‌న్ను చెల్లించే నివాస భ‌వ‌నాల రీ అసెస్‌మెంట్ ప్రక్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు.

హ‌రిత‌హారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాట‌డంతో పాటు విద్యార్థులు, యువ‌కులు, సీనియ‌ర్ సిటిజ‌న్లు, కాల‌నీ సంక్షేమ సంఘాల స‌భ్యుల‌తో స్వచ్ఛ కార్యక్రమాల‌ను నిర్వహించాల‌ని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ను ఏరివేసే ప్లాగింగ్ కార్యక్రమాల‌ను చేప‌ట్టాల‌ని సూచించారు. న‌గ‌రంలో సాయంత్రవేళ‌లో చెత్తను ఎత్తివేయ‌డానికి అద‌న‌పు వాహ‌నాల ఏర్పాటుకు అనుమ‌తి మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని... ఈ వాహ‌నాల సేక‌ర‌ణ‌కు వెంట‌నే టెండ‌ర్లను పిల‌వాల‌ని సూచించారు. న‌గ‌రంలో నీటిని వృథా నిరోధించాల‌ని, పగిలిపోయిన పైపులను గుర్తించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు దానకిషోర్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​ను కమ్మేసిన కారుమబ్బులు... పలు చోట్ల వర్షం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.