ETV Bharat / state

పాదచారులు భద్రంగా వెళ్లండి!

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించాక హైదరాబాద్​లోని కొన్ని చోట్ల ట్రాఫిక్‌ సిగ్నళ్లు పనిచేయక రోడ్లు దాటేందుకు పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న అధికారులు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 100 చోట్ల పెలికాన్ సిగ్నళ్లను ప్రారంభించనున్నారు.

new signals started for pedestrians
పాదచారీ.. భద్రంగా వెళ్లు!
author img

By

Published : Jun 7, 2020, 9:46 AM IST

ప్రస్తుతం నగరంలోని ఏ ప్రధాన ప్రాంతంలో చూసినా హారన్లు కొడుతూ దూసుకొచ్చే వాహనాలు, ట్రాఫిక్‌ స్తంభించడాలు కనిపిస్తుంటాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించాక కొన్ని చోట్ల ట్రాఫిక్‌ సిగ్నళ్లు పనిచేయక రోడ్లు దాటేందుకు పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా కట్టడి విధులు నిర్వహిస్తూనే పాదచారుల సాఫీ ప్రయాణానికి జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ అధికారులు సిద్ధమయ్యారు. మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో 100 చోట్ల పెలికాన్‌ సిగ్నళ్లను ప్రారంభించనున్నారు. క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి రెండు, మూడు రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

రెండో స్థానంలో..

హైదరాబాద్‌ నగరం, సైబరాబాద్‌ పరిధుల్లో రోజూ సగటున 8 లక్షల మంది పాదచారులు రోడ్లు దాటుతున్నారు. దాటేందుకు కూడళ్ల వద్దే అనువైన పరిస్థితులున్నాయి. విద్యాసంస్థలు, ఆసుపత్రులున్న చోట్ల రోడ్డు దాటాలంటే దడే. పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అబిడ్స్‌, కోఠి, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, సనత్‌నగర్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో అధికంగా పాదచారులే గాయపడుతున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రమాదాల్లో క్షతగాత్రులు, చనిపోతున్న వారిలోనూ పాదచారులదే రెండో స్థానం.

తొలి దశలో ఈ ప్రాంతాల్లో..

రద్దీ రహదారులతోపాటు పాదచారులకు అవసరమైన ప్రాంతాలను ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పటికే ఎంపిక చేసి పెలికాన్‌ సిగ్నళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుకు అటూఇటూ తెలుపు, ఎరుపు రంగులతో కూడిన గీతలు గీస్తున్నారు. పాదచారులు దాటేటప్పుడు ప్రమాదాలు జరక్కుండా వాహనదారులకు కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. మెహిదీపట్నం రైతుబజార్‌ వద్ద ఉన్న పెలికాన్‌ సిగ్నల్‌ మూడేళ్ల నుంచి చక్కగా పనిచేస్తున్న దృష్ట్యా మిగిలినచోట్లా ఇవే పెట్టేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ సిగ్నళ్లు ప్రతి 2 లేదా 3 నిమిషాల వ్యవధిలో పనిచేస్తాయి. విద్యార్థులు తిరిగే ప్రాంతాలైన సికింద్రాబాద్‌, అబిడ్స్‌, అమీర్‌పేట, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో తొలిదశలో ఏర్పాటు చేయనున్నామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.