జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సర్కిల్ కార్యాలయంలోకి వచ్చే వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. సర్కిల్ కార్యాలయం ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.
బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు ఏ పార్టీ బీ ఫామ్లను ఇవ్వకపోవడం వల్ల నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు కూడా రావడం లేదు. అయితే గురువారం నుంచి నామినేషన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: గ్రేటర్ పోరు: సర్కిళ్ల వారీగా నోటీసు విడుదల చేసిన ఆర్వోలు