ETV Bharat / state

బల్దియా ఎన్నికలు.. విపక్ష పార్టీలకు సవాల్ - తెలంగాణ రాజకీయాలు

రాజధానిలో రాజుకున్న ఎన్నికల వేడి.. పార్టీలకు ఊపిరి సలపనీయటంలేదు. మెరుపువేగంతో దూసుకొచ్చిన బల్దియా ఎన్నికలు.. నేతలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. గ్రేటర్‌ పోరుపై తాపీగా ఉన్న వేళ.. ఊహించని విధంగా మోగిన నగారాతో.. విపక్షాలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. ప్రత్యర్థులు తేరుకోకముందే అభ్యర్థులతో సిద్ధమైన కారు.. గ్రేటర్‌ పోరులో విపక్ష పార్టీలకు సవాల్‌ విసురుతోంది. తక్కువ సమయమున్న తెరాసకు పోటీగా పార్టీలన్నీ ఆగమేఘాల మీద కదనరంగానికి సిద్ధమవుతున్నాయి.

ghmc elections
బల్దియా ఎన్నికలు.. విపక్ష పార్టీలకు సవాల్
author img

By

Published : Nov 18, 2020, 9:34 PM IST

అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునే సమయం లేదు.. వ్యూహ ప్రతివ్యూహాలకు ఆస్కారమేలేదు.. కేవలం 14 రోజుల వ్యవధిలోనే ముగినయనున్న క్రతువు.. అధికార పార్టీ మినహా... మిగతా పార్టీలు పోరుకు సన్నద్ధమయ్యేలోపే గ్రేటర్‌ ఎన్నికలు ముగియనున్నాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక నుంచి ఇతరత్రా వ్యూహాలు అమలుకు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రచారం చేసేందుకూ పార్టీలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వ్యూహాత్మకంగా వెళ్లాలని ప్రధాన పార్టీలు నిర్ణయించాయి. నామినేషన్ల గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో... ఆశావహులు, నేతలతో పార్టీల కార్యాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి.

ప్రత్యేక వ్యూహాలతో..

బల్దియా పోరుకు అంతర్గతంగా ఇప్పటికే సిద్ధంగా ఉన్న అధికార పార్టీ.. పోరులో దూసుకెళ్తోంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కొన్ని నెలలుగా అన్నీ తానై అభివృద్ధి కార్యక్రమాలపై తనదైన ముద్రవేశారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే మరోవైపు తెరాసను ఆయన ఎన్నికలకూ సన్నద్ధం చేశారు. గత ఎన్నికల్లో తెరాస తరఫున గెలిచిన 99 మంది కార్పొరేటర్లను నిలుపుకునేందుకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కొన్ని నెలల క్రితమే జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశమైన కేటీఆర్... ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పనితీరు బాగాలేని కొందరిని తీరుమార్చుకోవాలని అప్రమత్తం చేశారు. షెడ్యూల్‌ విడుదల సమయానికే అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తిచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పోటీలో ఉన్న వారికి ఇప్పటికే సమాచారమిచ్చి... పోరుకు సిద్ధం చేస్తోంది.

బిహార్​ ఫలితాల జోరుతో..

జీహెచ్​ఎంసీలో రెండో అతిపెద్ద పార్టీ అయిన ఎంఐఎం... గత ఎన్నికల్లో అధికార పార్టీతో కలిసి పోటీ చేయకపోయినా....అవగాహనతో ముందుకు వెళ్లాయి. ఈసారీ కూడా అదే రీతిలో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొన్ని డివిజన్లలో స్నేహపూర్వక పోటీకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్న మజ్లిస్​.. గత ఎన్నికల్లో సాధించిన డివిజన్ల సంఖ్యను పెంచుకోవటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. తమకు పట్టున్న ప్రాంతాలతో పాటుగా.. ఇతర నియోజకవర్గ డివిజన్లపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల బిహార్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెల్చిన ఉత్సాహంలో ఉన్న ఆ పార్టీ.... తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. అందుకు అనుగుణంగా....పార్టీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

కమలానికి షాక్​..

బల్దియా ఎన్నికలపై కమలం పార్టీ కాస్త ముందుగానే అప్రమత్తమైనా.. నోటిఫికేషన్‌, పోలింగ్‌ మధ్య అతితక్కువ వ్యవధి ఉండటం ఆ పార్టీని షాక్‌కు గురిచేసింది. దీనికితోడు అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి మరింత సమస్యగా మారింది. ఇప్పటికే డివిజన్ల వారీగా సర్వేలు నిర్వహించిన భాజపా... ఆశావహుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించింది. సిట్టింగ్‌లతో పాటు ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరిన కార్పొరేటర్లకు, నాయకులకు టికెట్‌ ఇవ్వాలని భావిస్తోంది. తెరాస, కాంగ్రెస్ అసంతృప్తులు, టికెట్ దక్కే అవకాశంలేని బలమైన నాయకులను చేర్చుకునే ప్రయత్నాలను సైతం ముమ్మరం చేసింది. జనసేన పార్టీతో కలిసి పోటీ చేయాలని పార్టీ తొలుత నిర్ణయించినా.. పొత్తుకు ముందడుగు పడలేదు. దీంతో ఒంటరిగా పోటీకి దిగాలని నిర్ణయించారు.

కాంగ్రెస్​కు కంటిమీద కునుకు లేకుండా..

దీపావళి తర్వాత ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని ముందే అంచనా వేసిన కాంగ్రెస్‌... గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించింది. కానీ, ఊహించని విధంగా 14 రోజుల వ్యవధిలోనే ఎన్నికలు జరుగుతున్నందున...అభ్యర్థుల ఎంపిక నుంచి ఇతరత్రా వ్యూహాల అమలుకు పార్టీ నాయకత్వం ఉరుకులు పరుగులు పెడుతోంది. అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు తీసుకున్నా... ఇప్పటికీ పూర్తిస్థాయిలో వాటిని పరిశీలన కూడా చేయలేదు. పార్లమెంటరీ నియోజకవర్గాల కోఆర్డినేషన్‌ కమిటీలను మాత్రమే నియమించినప్పటికీ... ఏ డివిజన్‌లో అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయన్న అంశంపైనా సర్వే చేయలేదు. గతంలో పదవులు అనుభవించిన వారే ఎన్నికల వేళ ఇతర పార్టీల్లోకి వలసలు వెళుతుండటం హస్తం నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో... బలమైన నాయకులనే బరిలో దింపాల్సి ఉండడంతో... అభ్యర్ధుల ఎంపికపై భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైనందున... అనుకున్న సమయానికి అభ్యర్ధుల ఎంపిక పూర్తికానట్లయితే ఆశావహుల చేత నామినేషన్‌ వేయించి... తుది జాబితాలో ఉన్న వారికి బీఫారాలు ఇవ్వాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఇవీచూడండి: రాజకీయం రసవత్తరం... గ్రేటర్​లో వలసల పర్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.