ETV Bharat / offbeat

వీకెండ్ స్పెషల్ : KFC స్టైల్ "చికెన్ పాప్​కార్న్" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్! - POPCORN CHICKEN RECIPE

వీకెండ్​ రోజు మంచి ఫుడ్​తో ఎంజాయ్​ చేయాలనుకుంటున్నారా? - మీకోసమే ఈ అద్దిరిపోయే రెసిపీ!

KFC STYLE CHICKEN POPCORN
Chicken Popcorn Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2025, 10:14 AM IST

Chicken Popcorn Recipe in Telugu : పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడే నాన్​వెజ్ ఐటమ్స్​లో చికెన్ ఫస్ట్ ప్లేస్​లో ఉంటుంది. ఇక వీకెండ్ వస్తుందంటే చాలు ఎప్పటిలాకాకుండా ఈసారి కొత్త రెసిపీ ట్రై చేయాలనుకుంటారు చాలా మంది. అలాంటి వారి కోసం ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, "KFC స్టైల్ చికెన్ పాప్​కార్న్". సూపర్ టేస్టీగా ఉండే ఈ పాప్​కార్న్​ను ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు! మరి, ఈ క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

మారినేషన్ కోసం :

  • బోన్​లెస్ చికెన్ - అరకేజీ
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మిరియాల పొడి - 1 టీస్పూన్
  • గార్లిక్ పౌడర్ - 1 టీస్పూన్
  • కారం - రుచికి తగినంత
  • ఆనియన్ పౌడర్ - 1 టీస్పూన్
  • ఆమ్​చూర్ పౌడర్ - అరటీస్పూన్
  • పంచదార - పావుటీస్పూన్
  • మిక్స్​డ్ హెర్బ్స్​ - 1 టీస్పూన్
  • వెనిగర్ - అరటేబుల్​స్పూన్
  • డార్క్ సోయా సాస్ - 1 టీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీస్పూన్
  • కాచిన చల్లార్చిన పాలు - 1 టేబుల్​స్పూన్

కోటింగ్ కోసం :

  • మైదా - 2 కప్పులు
  • కార్న్​ఫ్లోర్ - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మిక్స్​డ్ హెర్బ్స్​ - 1 టీస్పూన్
  • గార్లిక్ పౌడర్ - 1 టీస్పూన్
  • కారం - తగినంత
  • నూనె - వేయించడానికి సరిపడా

ఏ కెఫెకి తీసిపోని చికెన్ కట్లెట్- ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! నెల రోజులు నిల్వ ఉంటుందట!!

తయారీ విధానం :

  • ముందుగా బోన్​లెస్​ చికెన్​ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ఉప్పు, మిరియాల పొడి, గార్లిక్ పౌడర్, కారం, ఆనియన్ పౌడర్, ఆమ్​చూర్ పౌడర్, చక్కెర, మిక్స్​డ్ హెర్బ్స్​, వెనిగర్, డార్క్ సోయా సాస్, అల్లంవెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, కాచిన చల్లార్చిన పాలు ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి.
  • ఆపై ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చెప్పిన గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్ అనేవి అన్నీ సూపర్ మార్క్​ట్స్​లో దొరుకుతాయి.
  • ఆవిధంగా చికెన్​ని మిక్స్ చేసుకున్నాక బౌల్​పై మూతపెట్టి కనీసం రెండు గంటల పాటైనా ఫ్రిజ్​లో ఉంచాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన ఇతర ఐటమ్స్​ను ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా కోటింగ్ కోసం మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, కార్న్​ఫ్లోర్, ఉప్పు, మిక్స్​డ్ హెర్బ్స్, గార్లిక్ పౌడర్, కారం వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఐస్ వాటర్​ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక బౌల్​లో కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం మారినేట్ చేసి 2 గంటలు ఫ్రిజ్​లో ఉంచిన చికెన్లో​ ఒక్కో ముక్కని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదాపిండి మిశ్రమంలో వేసి బాగా కోట్ చేసుకోవాలి.

తెలంగాణ స్టైల్​ "నాటుకోడి పులుసు" - ఇలా చేస్తే అద్దిరిపోవాల్సిందే!

  • అలా చేసుకున్నాక చికెన్ ముక్కను ఐస్ వాటర్​లో వేసి 15 నుంచి 20 సెకన్లపాటు ఉంచాలి. అనంతరం ఐస్​ వాటర్​లో నుంచి తీసి మళ్లీ మైదాపిండి మిశ్రమంలో వేసి మరోసారి కోట్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చికెన్​పై లేయర్స్​ అనేవి వస్తాయి.
  • ఆవిధంగా కోట్ చేసుకున్నాక చికెన్ ముక్కను ఒకసారి దులిపి ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలన్నింటినీ చక్కగా కోట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత వెంటనే ఫ్రై చేసుకోకుండా ముక్కలపై కోటింగ్ కాస్త ఆరిపోయే వరకు అంటే 5 నుంచి 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని కోట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి.
  • ఆపై మీడియం ఫ్లేమ్ మీదనే మధ్యమధ్యలో కలుపుతూ చికెన్ ముక్కలు క్రిస్పీగా మారి, గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలానే ముక్కలన్నింటినీ వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక టిష్యూ పేపర్ పరచిన ప్లేట్​లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే KFC స్టైల్ "చికెన్ పాప్​కార్న్" రెడీ!

బ్యాచిలర్స్ రెసిపీ "చికెన్ టిక్కా బిర్యానీ" - వంట రాని వారు కూడా ఈజీగా చేసేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.