ETV Bharat / state

'డెంగీ జ్వారాలని చెప్పి డబ్బును దండుకుంటే కఠిన చర్యలు'

సాధారణ జ్వరాలను డెంగీ జ్వరాలని ప్రజల్ని భయపెడుతూ రోగుల నుంచి సొమ్మును దండుకుంటున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల పట్ల  కఠినంగా వ్యవహరించాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ స్పష్టం చేశారు. మూడు జిల్లాలకు చెందిన వైద్య శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్రేటర్​ పరిధిలోని కార్పొరేట్​ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

'డెంగీ జ్వారాలని చెప్పి డబ్బును దండుకుంటే కఠిన చర్యలు'
author img

By

Published : Aug 13, 2019, 11:25 PM IST

జ్వరంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వారికి సరైన నిర్ధరణ పరీక్షలు చేయకుండానే డెంగీ సోకిందని భయబ్రాంతులకు గురిచేసి డబ్బులు దండుకుంటున్న ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరించాలని బల్దియా కమిషనర్​ దానకిశోర్​ ఆదేశించారు. పలు ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ చికిత్స పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు.

ఈనెల 16 నుంచి 26 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు

నగరంలో సీజనల్ వ్యాధులు, వాటి నివారణకు చేపట్టిన చర్యలపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్య శాఖ అధికారులు, మలేరియా అధికారులు, ఎంటమాలజి అధికారులతో దానకిశోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్​లో పది రోజులపాటు అంటు వ్యాధుల నివారణ, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి 26 వరకు గ్రేటర్​లో 600 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించడం ద్వారా పాత్రల్లోనూ ఇంటి పరిసరాల్లోనూ నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగానికి చెందిన 650 బృందాలు పాల్గొంటున్నాయన్నారు.

పదిమందికి రూ.పదివేల చొప్పున బహుమతి

దోమల వల్ల సంభవించే వ్యాధులపై ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ మస్కిటో యాప్​ను 8 లక్షల మందికిపైగా డౌన్​లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఈ యాప్​లో ఉన్న 17 ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలిపిన వారిని లాటరీ ద్వారా 10 మందిని ఎంపికచేసి ఒకొక్కరికి రూ.10వేలు చొప్పున అందజేస్తామని దానకిశోర్ ప్రకటించారు.

ఇదీ చూడండి: 'జిమ్​లు మూతపడ్డాయి... ఆరోగ్య కేంద్రాలు వెలిశాయి'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.