ఆరో విడత హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 లక్షల మొక్కలు నాటుతామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. సూరారం, మాదన్నగూడ, నాదర్గుల్లో అర్బర్ ఫారెస్ట్ పార్కులు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
నగరంలోని కాలనీలు, అపార్ట్మెంట్ వాసులు ఈ ఏడాది పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నగరంలో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతుందని.... మొక్కలు ఎక్కువ సంఖ్యలో పెంచి హరిత హైదరాబాద్‌గా మార్చాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు.
ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల