వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు జంటనగరాల్లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన శిథిల భవనాల తొలగింపు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా తొలిరోజు 30 భవనాలను కూల్చివేశారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో కొత్తగా 377 శిథిల భవనాలను గుర్తించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లు, ఏటవాలు ప్రాంతాల్లో గుడిసెల్లో ఉండే ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన సూచించారు. మరో వారం రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇదీచూడండి: శిథిల భవనాల కూల్చివేతకు సహకరించాలి:లోకేశ్‌కుమార్