ETV Bharat / state

ఫెవిక్విక్​తో‌ దేన్నైనా అతికిస్తాం కానీ.. లోపలెందుకు అతుక్కోదు?

ఫెవిక్విక్‌, ఫెవికాల్‌తో మనం దేన్నైనా అతికిస్తాం. మరి ట్యూబ్‌కి అతకదు ఎందుకని? - రాము, హైదరాబాద్‌

general knowledge on feviquick
general knowledge on feviquick
author img

By

Published : Jul 29, 2020, 1:57 PM IST

ఫెవికాల్‌, ఫెవిక్విక్‌ రెండూ వాణిజ్యపరమైన పేర్లు. అవి రసాయనిక పేర్లు గానీ, సాంకేతిక పదాలు గానీ కాదు.

  • ఇందులో ఉన్న రసాయనిక సంఘటనం (కెమికల్‌ కంపోజిషన్‌) వాణిజ్యరహస్యం.
  • అయినా అతికించేందుకు ఉపయోగించే ధాతువుల్లో ప్రధానంగా ఉండేది పాలీ అమైడ్లు, కార్బోప్రోటీన్లు, పిండి పదార్థాలు. వీటికి ఉండే ప్రధాన లక్షణం కాగితాలు, చెక్క వంటి వస్తువుల మధ్య సంధానంగా పనిచేయడం. దీనికి కారణం... ఈ జిగురు పదార్థాల్లోను వీటి ద్వారా అతికించే వస్తువుల్లోను కొన్ని రసాయనిక లక్షణాలు ఒకేలా ఉండటం.
  • ఫెవికాల్‌, ఫెవిక్విక్‌ వంటి పదార్థాలు అతుక్కోవాలంటే అవి గాలిలోని ఆక్సిజన్‌ సమక్షంలో బహు అణువులు (పాలీమర్స్‌)గా పెద్దగా కావాలి. పైగా అందులో ఉన్న తేమ ఆవిరి కావాలి. అంతేకాదు అవి వేటి మధ్యనయితే జిగురుగా పని చేసి అతికిస్తాయో వాటి ఉపరితలాల్లో ఉన్న పదార్థంతో రసాయనిక బంధాన్ని ఏర్పర్చాలి. అలాంటి సదుపాయం ట్యూబుల్లో వీలు కాదు. అందుకే అవి గట్టి పడకుండా, అతుక్కోకుండా ఉండగలవు
  • - ప్రొ।। ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.