GAS PIPELINE BLAST : అందరూ పడుకునే వెేళలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఎక్కడ నుంచి వచ్చిందా అని అందరూ కంగారుతో ఇంటి నుంచి బయటకు వచ్చి చూసేసరికి గ్యాస్ పైప్ లైన్ పేలిపోయింది. అక్కడ నుంచి అంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో చోటుచేసుకుంది.
తిరుపతిలోని రాత్రి సమయంలో సుమారు 10 గంటలకు అందరూ కూలీ పనులకు, ఉద్యోగాలకు వెళ్లి వచ్చి విశ్రాంతి తీసుకుందామని.. పడుకునే సరికి భారీ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా పేలుడు రావడంతో అంతా ఉలిక్కి పడి.. ఇంటినుంచి బయటకు పరిగెత్తుకుని వచ్చారు. గ్యాస్ పైపులైన్ పేలడంతో ఈ ఘటన జరిగిందని గుర్తించి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామికవాడలో గ్యాస్ పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో అధికారులు కొందరు దానిని పరిశీలించి వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి భయంతో పరుగులు తీశారు. గ్యాస్పైప్ లైన్లు పేలడంతో 30 అడుగుల మేర రాళ్లు, మట్టి పైకి ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతులు చేసేందుకు యత్నిస్తున్నారు.
అయితే ఆ గ్యాస్ పైప్లైన్ ఉన్న ప్రాంతంలో రద్దీ ఎక్కువుగా ఉంటుంది. పెట్రోల్ బంక్, హోటల్, దాబా ఉండటం వల్ల ఎప్పుడూ ప్రజలతో కిక్కిరిసి ఉంటుంది. అప్పటి వరకూ అక్కడే ఉన్న కొద్దిమంది పేలుడు జరగడానికి ముందే ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వారు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: