ఉత్తరాంధ్ర ప్రజల గుండె చప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం అని ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కూర్మన్నపాలెం గేట్ ముఖ ద్వారం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతల నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు.
'దీక్షలో నన్ను భాగస్వామి చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేశాను. అయితే స్పీకర్ ఫార్మాట్‌లో లేదని కొందరు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరోసారి లేఖ ఇస్తా. పోరాటం చేసేది కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీనే. కార్మిక సంఘాలకు అండగా నిలుస్తా' అని అన్నారు.
ఇదీ చదవండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీపీ అంజనీకుమార్ టగ్ ఆఫ్ వార్