ETV Bharat / state

'మంత్రి తలసాని ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం' - hyderabad latest news

ముదిరాజుల ఆత్మగౌరవ భవనం ప్రారంభోత్సవ సభలో మంత్రి తలసాని చేసిన ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని... గంగపుత్ర చైతన్య సమితి అధ్యక్షుడు సత్యనారాయణ బెస్త అన్నారు. ఆయన మాటలు గంగపుత్రులకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయని... అంబర్​పేటలో నిరసన చేపట్టారు.

Gangaputra Chaitanya Samithi protest in ambarpet, hyderabad
మంత్రి తలసాని ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
author img

By

Published : Jan 15, 2021, 5:39 AM IST

ముదిరాజుల ఆత్మగౌరవ భవనం ప్రారంభోత్సవ సభలో మంత్రి తలసాని మాటలు గంగపుత్రులకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయని... గంగపుత్ర చైతన్య సమితి అధ్యక్షుడు సత్యనారాయణ బెస్త అన్నారు. గంగపుత్రులతో పాటు 18సంవత్సరాలు నిండిన ముదిరాజులకు సభ్యత్వాలు ఇస్తామన్న మంత్రి ప్రకటనకు వ్యతిరేకంగా... అంబర్​పేటలో నిరసన చేపట్టారు.

గంగపుత్రుల చేతుల్లో ఉన్న వెయ్యిలోపు సొసైటీలను లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అన్ని పోలీస్​స్టేషన్​లలో తలసానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి వెంటనే క్షమాపణ కోరాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని... అప్పటికీ కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలనలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చదవండి: అంబరాన్నంటిన సంబురాలు... కిటకిటలాడిన ఆలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.