మహాత్మాగాంధీ సిద్ధాంతాలే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. భాజపా గాంధీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి.. మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని ఆయన ఆరోపించారు. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గాంధీభవన్‌లో ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు.
భాజపాకు గాంధీని తాకే అర్హత లేదని ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతోన్మాద పార్టీ మజ్లిస్‌తో భాజపా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఉత్తమ్ విమర్శించారు. తెరాస సైతం భాజపా, మజ్లిస్‌తో దోస్తీ చేస్తుందని.. అందుకే భైంసా ఘటనపై స్పందించలేదన్నారు.
ఈ మూడు పార్టీలు గాంధీ సిద్దాంతాలను పక్కకు పెట్టి.. మత రాజకీయాలు చేస్తున్నాయని ఉత్తమ్ దుయ్యబట్టారు. ఇప్పుడున్న పాలనను చూస్తే.. గాంధీ ఆత్మ క్షోభిస్తుందని ఆయన తెలిపారు.