ETV Bharat / state

అందరికీ పరీక్షలు వద్దంటే.. వినరే!

author img

By

Published : Mar 14, 2020, 8:58 AM IST

దగ్గు, జలుబు అనుమానంతో కరోనా పరీక్షలు చేయాలంటూ గాంధీ ఆస్పత్రికి అనుమానితులు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిలో ఈ ఆందోళన అధికంగా ఉంటోంది. పరీక్షకు రూ.40-50 వేలైనా చెల్లిస్తామంటూ ఆస్పత్రి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే పరీక్షలు చేస్తామంటూ ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని అధికారులు అంటున్నారు.

Gandhi hospital full rush with people in Corona suspects
అందరికీ పరీక్ష అవసరం లేదు.. వద్దంటే వినరే!

సార్‌.. నాకు జలుబు, దగ్గు ఉంది. కరోనా లక్షణాలున్నాయనే అనుమానముంది. పరీక్ష చేయండి.

నేను ఇటీవలే విదేశాల నుంచి వచ్చాను. లక్షణాలేమీ లేవు. కానీ కరోనా ఉందేమో అనే అనుమానాలున్నాయి. పరీక్షించండి.

వ్యాపార లావాదేవీల కోసం విదేశాలకు వెళ్లాలి. నాకు కరోనా లేదని ధ్రువపత్రమివ్వండి. ఎంతైనా చెల్లిస్తా.. ఇవీ గాంధీ ఆసుపత్రి వద్ద పలువురి డిమాండ్‌.

కరోనా లేదనే ధ్రువపత్రం కోసం

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం వల్ల.. ప్రజల్లో అనుమానాలూ పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు ఉంటే.. అనుమాన నివృత్తి కోసం కరోనా పరీక్షలు చేయాలంటూ సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి వద్ద పలువురు బారులు తీరుతున్నారు. ఇందులో ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుంటున్నారు. వారి కార్యాలయాల్లో విదేశీ ప్రయాణం చేసిన సహచర ఉద్యోగులు ఉంటుండడం వల్ల.. అనుమానిస్తున్నారు. అలానే వివిధ పనులపై, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు.. ఆయా దేశాల్లో ‘తనకు కరోనా లేదని’ నిర్ధారించే ధ్రువపత్రాన్ని చూపాల్సి ఉంటుంది. కావున పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు చేయడం కుదరదని వైద్యులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీరంతా ఒకింత నిరాశతో వెనుదిరుగుతున్నారు. అనుమానిత లక్షణాలుంటే తప్ప.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం కుదరదని, అందరికీ ఈ పరీక్షలు అవసరం లేదని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

బెదిరింపులు.. ఒప్పందాలు

కరోనా అనుమానిత లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి వస్తున్న వారిలో నిత్యం 15-25 మంది నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. వీరుకాకుండా అనుమానాలతో నిత్యం 10-15 మంది వస్తున్నారని వైద్యవర్గాలు తెలిపాయి. పరీక్షల కోసం ఎన్ని వేలైనా ఇస్తామంటూ హెల్ప్‌డెస్క్‌ వద్ద సిబ్బందితో వీరు వాదనకు దిగుతున్నారు. కొందరు పైరవీలు చేస్తున్నారు. ఇంకొందరు నేరుగా ల్యాబ్‌ వద్దకే వెళ్లి సిబ్బందితో బేరాలాడుతున్నట్లు తెలుస్తోంది. ‘‘మేం ఎంత కోరినా పరీక్షలు నిర్వహించడం లేదు. ఒకవేళ మా ద్వారా ఇతరులకు సోకితే మేము బాధ్యులం కాదంటూ బెదిరింపులకూ పాల్పడుతున్నారు. వైద్యులు పరీక్షలకు నిరాకరించడం వల్ల ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ వెనుదిరగడం కనిపించింది.

ప్రైవేటులో అనుమతి లేదు

కరోనా నిర్ధారణ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రభుత్వ ప్రయోగశాలల్లోనే చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో నిర్వహిస్తుండగా.. త్వరలోనే ఉస్మానియా, ఫీవర్‌, ఐపీఎం, కాకతీయ వైద్యకళాశాలల ప్రయోగశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో వినియోగించే రసాయనాలు, కిట్లు, ఇతర వస్తువులు అత్యంత ఖరీదైనవి. అవసరాల మేరకే కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా పంపిస్తోంది. ఈ నేపథ్యంలో గాంధీకి తాకిడి పెరిగింది.

అందరిలోనూ పరీక్షలు అవసరం లేదు- డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకులు

"సాధారణ జలుబు, దగ్గు, జ్వరం ఉంటే కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదు. విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారిందరికీ కూడా పరీక్షలు చేయాల్సిన పనిలేదు. విదేశీ ప్రయాణం చేసి వచ్చిన తర్వాత జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే.. కరోనా అనుమానిత వ్యక్తితో సన్నిహితంగా మెలిగితే.. ఇలా స్పష్టమైన మార్గదర్శకాలు అనుసరించి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అనవసర భయాందోళనతో పరీక్షల కోసం రావొద్దు. విదేశాల నుంచి వచ్చినవారు కనీసం 14 రోజులు ఇంట్లోనే విడిగా ఉండాలి. వారు కుటుంబ సభ్యులతోనూ సన్నిహితంగా మెలగరాదు. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగొద్దు. ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే 104కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి" అని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.