ETV Bharat / state

నిండుగా నిధులు... సాగాలి పనులు.. - హైదరాబాద్​ తాజా వార్తలు

గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. అందుకోసం నిరంతరం నిధులు అందిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా పనులు జరిగేందుకు అధికారులను అప్రమత్తం చేస్తోంది. ఇలా గడిచిన పది నెలల్లో రూ.123.70కోట్లు ఖాతాల్లో జమయ్యాయి. వీటితో కొన్ని పంచాయతీలు ప్రగతిపథంలో పయనిస్తుంటే మరికొన్ని చోట్ల పాలకవర్గాల నిర్లక్ష్యంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనన్న చందంగా ఉంది. ప్రజా ప్రతినిధులు చొరవచూపితే నెమ్మదిగా సాగుతున్న పనుల్లో సైతం వేగం పుంజుకుని అభివృద్ధి దిశగా సాగుతాయి.

Funds for Gram Panchayats in telangana
నిండుగా నిధులు... సాగాలి పనులు..
author img

By

Published : Aug 12, 2020, 9:52 AM IST

తాండూరుగ్రామీణ జిల్లాలో రెండేళ్ల క్రితం 365 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2018లో స్థానిక సంస్థల పునర్విభజనలో భాగంగా 201 కొత్తవి ఏర్పాటయ్యాయి. దీంతో మొత్తం 18 మండలాల్లో పంచాయతీల సంఖ్య 566కు పెరిగింది. వాటికి ఎన్నికలు నిర్వహించి పాలనా బాధ్యతలు పాలకవర్గాలకు అప్పగించడంతో పాటు పంచాయతీకి ఒకరు చొప్పున కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరందరి భాగస్వామ్యంతో గతేడాది సెప్టెంబరులో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడటంతో పాటు దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది.

అధికారమిచ్చారు...

పల్లె ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రతినెలా పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. జనాభా ప్రాతిపదికన మంజూరయ్యే 14వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తోంది. మరోవైపు పంచాయతీల పరిధిలో పరిశ్రమలు, కర్మాగారాల నుంచి పన్నుల రూపంలో అదనపు ఆదాయం సమకూరుతోంది. వీటిని ఆయా గ్రామాల్లో ఖర్చు చేసే అధికారం సర్పంచి, ఉపసర్పంచులకు అప్పగించారు.

కొన్నిచోట్ల వేగం...

తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సర్పంచుల చొరవ కారణంగా అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, వీధి దీపాలు, తాగునీటి బోరు మోటార్ల ఏర్పాటు, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ వంటి పనులు నిత్యం కొనసాగుతున్నాయి. వైకుంఠ ధామం, చెత్త దిబ్బల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు వేగంగా సాగుతున్నాయి.

  • వచ్చిన రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు: రూ. 52,48,95,591
  • 14వ ఆర్థిక సంఘం నిధులు: రూ.55,10,53,810
  • ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.3,74,46,100
  • పనితీరు ఆధారంగా వచ్చినవి: రూ.3,81,65,100
  • ఎస్సీ ఉప ప్రణాళిక కింద..: రూ.8,55,09,400

కొన్ని చోట్ల ఇలా..

కొన్ని పంచాయతీల్లో సర్పంచుల అలసత్వంతో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు.ఇందుకు కొన్ని ఉదాహరణలు...

  • ఐనెల్లిలో కాల్వలు నిర్మించకపోవడంతో మురుగు సీసీ రహదారులపై చేరి రాకపోకలకు అసౌకర్యంగా ఉంటోంది.
  • బెల్కటూరు ఎస్సీ కాలనీ, చెంగెష్‌పూర్‌ బోనమ్మ కాలనీల్లో సిమెంటు రహదారులు అసంపూర్తిగా ఉన్నాయి.
  • రాంపూర్‌, వీరారెడ్డిపల్లిలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి.
  • మల్కాపూర్‌లో కొన్ని స్తంభాలకు వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రివేళ అంధకారం నెలకొంటోంది.
  • కరణ్‌కోటలో పుస్తక నిక్షిప్త కేంద్రానికి సొంత భవనం నిర్మించకపోవడంతో ఐదేళ్లుగా టెంట్‌హౌస్‌లో నెట్టుకొస్తున్నారు.
  • ఓగీపూర్‌లో ప్రధాన మార్గంలో సిమెంటు రహదారి ఆధ్వానంగా ఉంది.

అందరూ భాగస్థులు కావాలి

గ్రామంలో అభివృద్ధిపై సర్పంచి, ఉపసర్పంచి, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు సమావేశమై చర్చించి ఆచరణలో పెట్టాలి. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి. ఎక్కడైనా మొక్కుబడిగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆయా గ్రామ ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - చంద్రశేఖర్‌రావు, డీఎల్‌పీఓ, తాండూరు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.