ETV Bharat / state

ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్: సబితా ఇంద్రారెడ్డి - minister Sabita Indrareddy updates

వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులతో రూపొందించిన ఇంటర్మీడియట్ స్టడీ మెటీరియల్​ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులకు కూడా వీటిని అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిని మంత్రి ఆదేశించారు.

ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్: సబితాఇంద్రారెడ్డి

author img

By

Published : Mar 18, 2021, 5:05 AM IST

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులతో రూపొందించిన స్టడీ మెటీరియల్​ను మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులకు కూడా వీటిని అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిని మంత్రి ఆదేశించారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా స్టడీ మెటీరియల్ రూపొందించామని.. వీటివల్ల విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ ఉపయోగం కలుగుతుందని సబితాఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

వారం రోజుల్లోగా స్టడీ మెటీరియల్ విద్యార్థులకు చేరాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్టడీ మెటిరీయల్ ఇంటర్ బోర్డు వెబ్​సైట్ www.sbie.cgg.gov.in లోనూ అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'పెట్రోల్‌, డీజిల్‌ ధరల పాపం కేంద్ర ప్రభుత్వానిదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.