ETV Bharat / state

మొగుళ్లపల్లి యువసేన @181వ కల్యాణం - దిల్​సుఖ్​నగర్​ సత్యనారాయణ ఆలయంలో వివాహం

నిరుపేదలకు అండగా నిలుస్తూ, వారికి చేతనైన సాయం చేస్తున్నారు హైదరాబాద్​కు చెంది మొగుళ్లపల్లి ఉపేందర్​ గుప్తా. మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో ఇప్పటికే 180 పేద జంటలకు కల్యాణం జరిపించారు. తాజాగా దిల్​సుఖ్​నగర్​లోని సత్యనారాయణ దేవస్థానంలో 181వ జంటకు ఘనంగా వివాహం చేశారు.

free marriage for poor people under the mogullapally yuvasena foundation in hyderabad
మొగుళ్లపల్లి యువసేన @181 కల్యాణం
author img

By

Published : Mar 19, 2020, 4:42 PM IST

మొగుళ్లపల్లి యువసేన @181 కల్యాణం

ఎంతోమంది నిరుపేదలకు అన్నీతానై అండగా నిలుస్తున్నారు హైదరాబాద్​కు చెందిన మొగుళ్లపల్లి ఉపేందర్​ గుప్తా. మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో 180 పేద జంటలకు వివాహం జరిపించారు.

దిల్​సుఖ్​నగర్​లోని సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నేడు 181వ జంటకు వైభవంగా కల్యాణం జరిపించారు. మేళతాళాలు, మంగళ వాద్యాలు, పురోహితుల వేద మంత్రాల నడుమ వధూవరులు ఒక్కటయ్యారు.

పేదరికంలో ఉండి వివాహం చేసుకోవాలనుకునే వారికి అండగా నిలిచి, ఘనంగా వివాహం జరిపిస్తామని మొగుళ్లపల్లి ఉపేందర్​ గుప్తా తెలిపారు. కల్యాణం చేసుకోవాలనుకునే వారు 15 రోజుల ముందు తమను సంప్రదించాలని కోరారు. సమాజానికి తన వంతు సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.