ETV Bharat / state

సాగర్ ​తీరాన మళ్లీ రయ్.. రయ్​.. వచ్చే నెలలోనే ఈ-రేసింగ్​ పోటీలు

Formula E race car competitions: హైదరాబాద్​లో మరోసారి రేసింగ్ కార్లు సందడి చేయనున్నాయి. వచ్చే నెల 11వ తేదీ నుంచి హైదరాబాద్​లో ఫార్ములా ఈ రేసింగ్​ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు వాటికి సంబంధించి టికెట్లు విడుదల చేశారు. కావాల్సిన వారు త్వరగా టికెట్లు బుక్​ చేసుకోగలరని తెలిపారు.

car competitions
car competitions
author img

By

Published : Jan 4, 2023, 5:19 PM IST

Formula E race car competitions Tickets: హుస్సేన్​సాగర్​ తీరాన రయ్.. రయ్..​ అంటూ రేస్​ కార్ల సందడి మరోసారి మొదలుకానుంది. వచ్చే నెల 11వ తేదీ నుంచి ఫార్ములా ఈ రేసింగ్​ ఉంటుందని నిర్వహకులు ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు టికెట్లు జారీ చేశారు. వెయ్యి రూపాయాలు నుంచి పది వేల రూపాయల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. రూ.1000లకు గ్రాండ్​స్టాండ్​​, రూ. ​3,500లు చార్జ్ ​గ్రాండ్​స్టాండ్, రూ.6000లకు ప్రీమియం గ్రాండ్​స్టాండ్​, రూ.10వేలకు ఏసీ గ్రాండ్​స్టాండ్​ టికెట్లు లభిస్తాయని తెలిపారు.

మొత్తం 11 దేశాలకు చెందిన 22 మంది ఈసారి పోటీల్లో పాల్గొంటారని నిర్వహకులు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన రేసింగ్​ ప్రాక్టీస్​ ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఏఎస్​ అధికారి అరవింద్​ కుమార్​.. దేశంలో టాప్ 25 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.

గత అనుభవాలతో సరికొత్త పాఠాలు: గత సంవత్సరం జరిగిన ఇండియాన్​ కార్​ రేసింగ్ ప్రాక్టీస్​ పోటీలు ఇప్పడు నిర్వాహకులకు సరికొత్త అనుభవాలు నేర్పిందని అనుకోవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలో కేటీఆర్​ ప్రత్యేక చొరవతో మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్​ రేసింగ్​ మొదటి నుంచి పెద్ద సవాల్​గా మారింది. హైదరాబాద్​ రోడ్డులో ఇలాంటి రేసింగ్​లు సక్రమంగా జరుగుతాయా అనే సందేహాలు అనేక మందికి వచ్చాయి. ఇందు కోసం ప్రత్యేకంగా హుస్సేన్​సాగర్​ పరిసరాల్లో 2.7 కి.మీల​ స్ట్రీట్ సర్క్యూట్​ తయారుచేశారు. దీనిపై వాహనదారులు, విపక్షపార్టీల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. రేసింగ్​ పేరుతో రోడ్లు పాడుచేస్తున్నారని మండిపడ్డారు.

వీటన్నీంటిని తట్టుకొని ప్రాక్టీస్​ మొదలు పెట్టగా మొదటి రోజే రేసర్లకు పెద్ద పరీక్ష ఎదురైంది. ట్రాక్​ సరిగ్గా లేకపోవడంతో కొన్నికార్లు బోల్తా పడిన ఘటనలు జరిగాయి. డైవర్ల అప్రమత్తతో స్వల్ప గాయాలతో రేసర్లు బయటపడ్డారు. దీనిని మరింతా సవాల్​గా తీసుకున్న నిర్వాహకులు కొద్ది రోజుల్లోనే మరల రోడ్లు పునరుద్దించి మరల మొదలపెట్టగా చిన్న చిన్న ప్రమదాలు మినహా సవ్యంగానే సాగయని చెప్పవచ్చు.

ఈసారి జనాదారణ ఎలా ఉండబోతుంది: ఫైనల్​ లీగ్​లో విజేతగా 417.5 పాయింట్లతో కొచ్చి మొదటి స్థానంలో నిలవగా.. 385 పాయింట్లతో హైదరాబాద్‌ రెండో స్థానం దక్కించుకుంది. ఆ తరువాత 282 పాయింట్లతో గోవా మూడో స్థానంలో, 279 పాయింట్లతో చెన్నై నాలుగో స్థానంలో నిలిచింది. రేసింగ్​ లీగ్​లు చూడడానికి చాలా మంది సినీతారలు, ప్రముఖులు వచ్చి వీక్షించారు. ఏదేమైనా వచ్చే నెల జరగబోయే పోటీల్లో ఇది వరకు జరిగే అనుభావాలు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడి.. మంచి వసతులు ఉంటే జనాదారణ తప్పక ఉంటుందని హైదరాబాదీ వాసులు అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.