కేరళలో ముత్తూట్ ఫైనాన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించారు. హిమాయత్‌నగర్‌లోని ముత్తుట్ ఫైనాన్స్ కార్యాలయం ముందు నాయకులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వారిపై వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : నిజామాబాద్ తర్వాత ఆ స్థాయిలో హుజూర్‌నగర్‌కు నామినేషన్లు