రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టిసారించింది. గాంధీభవన్‌లో సమావేశమైన నేతలు పలు అంశాలపై చర్చించారు.
పార్టీ వ్యవహారాల రాష్ట్ర బాధ్యులు కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హస్తం స్థానిక వ్యూహం..!
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా హస్తం నేతలు చర్చించారు. స్థానిక పోరులో అభ్యర్థుల ఎంపిక, అధికార పార్టీని ఎదుర్కొనే వ్యూహాలపై సమాలోచనలు జరిపారు.
ఎన్ని సీట్లు గెలుస్తాం...?
లోక్‌సభ పోలింగ్ తీరు, నియోజకవర్గాల వారీగా అనుకూల, ప్రతికూల పరిస్థితులపై కూడా నేతలు సమీక్షించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, నియోజకవర్గ బాధ్యులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామని ఉత్తమ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను గ్రామ, మండల, జిల్లా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పని చేయాలని ఉత్తమ్ సూచించారు.
15 లోగా మండల అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల జాబితా సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక నాయకత్వం అందుబాటులో లేని పక్షంలో జిల్లా లేదా రాష్ట్ర నాయకత్వం ఆ బాధ్యత తీసుకుంటుందన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థుల విషయంలో పీసీసీ ఎంపిక చేస్తుందన్నారు ఉత్తమ్.
ఇవీ చూడండి : 'ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే'