ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయల ఆర్థిక సాయం తమకు అందడం లేదని సీతాఫల్మండిలో వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపించారు.
సీతాఫల్మండిలో చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కార్యక్రమానికి భాజపా స్థానిక నాయకులు మద్దతు తెలిపారు. బాధితుల ఆందోళనతో పైవంతెనపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: 'దుబ్బాక స్ఫూర్తితో జీహెచ్ఎంసీలో భాజపాను గెలిపించండి'