హైదరాబాద్ ఉప్పల్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట వందలాది మంది వరద బాధితులు ఆందోళనకు దిగారు. వరద బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయం అసలైన ముంపు బాధితులకు ఇవ్వడంలేదంటూ వారు ఆరోపించారు. వారికి తెరాసకు చెందిన కార్పొరేటర్ మేకల అనాలరెడ్డి, హనుమంత్‌రెడ్డి మద్దతు పలికారు.
బాధితులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దానితో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వరదబాధితులకు సహాయం చేయడంలో వివక్ష చూపుతున్నారని, తెరాస కార్యకర్తలకు మాత్రమే పరిహారం ఇస్తూ అసలైన వారికి ఇవ్వడం లేదని ఆరోపించారు. తమకు సాయం అందించే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు.
ఇదీ చూడండి: సన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: రైతు సంఘం