హైదరాబాద్ సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అల్లాపూర్ డివిజన్లోని జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం ఎదుట మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రూ. 10 వేల ఆర్థిక సహాయం తమకు అందలేదని వారు ఆందోళన చేశారు.
అల్లాపూర్ డివిజన్లోని వివేకానందనగర్, తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అర్హులైన వారందరికీ అందించాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి: వరద సాయం కోసం నగరంలో పలుచోట్ల బాధితుల ఆందోళన