ప్రభుత్వం మానవతా దృక్పథంతో వరద బాధితులకు సాయం చేస్తుంటే... ప్రతిపక్షాలు పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. హిమాయత్ నగర్ డివిజన్‌లోని పలు బస్తీల ప్రజలకు ఇంటింటికి వెళ్లి వరద సాయం అందజేశారు.
నైతిక విలువలు పక్కనబెట్టి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. బాధితులకు చివరి ఇంటి వరకు పరిహారం అందిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని దానం హితవు పలికారు.