ETV Bharat / state

పసిపిల్లను పనిపిల్ల చేసి... చిత్రహింసలు - హైదరాబాద్​ నేర వార్తలు

పసిబిడ్డలను పనిబిడ్డలు చేసి... అక్షరాలు దిద్దాల్సిన చేతులతో అంట్లు తోమిస్తూ... బాల్యాన్ని బాధలతో నింపి.. భవిష్యత్తును అంధకారంగా మార్చి.. భావి భారత పౌరులను చిత్రహింసలు పెడుతున్న పలు ఉదంతాలు నేటి ఆధునిక సమాజంలోను వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన చాదర్​ఘాట్​ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది.

Harasment
పసిపిల్లను పనిపిల్ల చేసి... చిత్రహింసలు
author img

By

Published : Jun 12, 2020, 10:57 PM IST

సున్నితమైన చేతులు... అడుగేస్తే కందిపోయేంత మృదువైన పాదాలు.. ముద్దు ముద్దు మాటలు... ఆకట్టుకునే రూపాలు ఐదేళ్ల వయసులో చిన్నారులను చూసినప్పుడు కలిగే అనుభూతులు. కానీ ఈ చిన్నారిని చూసిన ఎంతటి కఠినాత్ములకైనా కన్నీరు రాక తప్పదు. బడికెళ్లే వయసులో బండెడు చాకరీ చేస్తూ... యజమానురాలి చేతిలో చిత్రహింసలు భరిస్తూ... ఒంటి నిండా గాయాలతో... దీనంగా చూస్తున్న ఈ ఐదేళ్ల చిన్నారికి... నేటికి విముక్తి లభించింది.

ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారితో ఇంటి పని చేయిస్తూ... బాలికను చిత్ర హింసలు పెట్టిన ఘటన చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ విషయం బాలల హక్కుల సంఘం దృష్టికి రావడం వల్ల... ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహకారంతో బాలికకు విముక్తి కల్పించారు.

వాహెద్‌నగర్‌కు చెందిన సీమ ... తనకు పరిచయస్తుడైన వైద్యుడి సహకారంతో ఐదేళ్ల బాలికను తన ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చింది. అయితే సీమ... బాలికను చిత్ర హింసలు పెడుతున్నట్లు గుర్తించిన స్థానికులు బాలల హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. బాలల హక్కుల సంఘం వారు ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి వెళ్లి పరిశీలించగా అసలు విషయం తెలిసింది. బాలిక తల, వీపు భాగంలో తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికను చిత్ర హింసలు పెట్టిన మహిళపై కఠిన చర్యలు తీసుకొని, బాలికను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు.

ఇవీచూడండి: రాజధానిపై కరోనా పంజాకు వారి అలసత్వమే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.