YS VIVEKA MURDER CASE UPDATES : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఐదుగురు నిందితులు తొలిసారిగా శుక్రవారం సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ మేరకు వారికి వేర్వేరుగా వారెంట్లు, సమన్లు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు కడప నుంచి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ప్రథమంగా విచారణ చేపట్టనుంది.
కడప కేంద్ర కారాగారంలో ముగ్గురు నిందితులకు ప్రొడెక్షన్ వారెంట్ జారీ కాగా.. బెయిలుపై ఉన్న మరో ఇద్దరికి సీబీఐ నుంచి సమన్లు జారీ అయ్యాయి. దీంతో నిందితులు గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో పాటు ఇదే కేసులో బెయిల్‌పై ఉన్న ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి శుక్రవారం ఉదయం హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు. నిందితులను ప్రత్యేక రక్షణతో హైదరాబాద్ తరలించడానికి ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి: