మెట్రో ప్రయాణికుల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేందుకు అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మొదటి అంతస్థులో ఉండే మెట్రోరైల్లో ప్రయాణించే వారు మెట్ల మార్గం ఎన్నుకోవడం ద్వారా ఎన్ని క్యాలరీలను ఖర్చు చేయొచ్చో సూచించేలా మెట్లపై చిత్రీకరించారు.
మాదాపూర్, రాయదుర్గం, మెట్రోస్టేషన్లలో ప్రయాణికులు లిఫ్ట్, ఎస్కలేటర్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనితో రద్దీ సమయంలో మెట్ల మార్గాన్ని కూడా ఉపయోగించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
స్టేషన్ మొదటి అంతస్తు చేరుకోవడానికి ఉపయోగించే మెట్లపై ఒక మెట్టు ఎక్కితే 0.5 క్యాలరీస్ ఖర్చు అవుతాయని అలా మెట్లపై కాలరీల విలవలను సూచిస్తూ దాదాపు 30 మెట్లు ఎక్కితే 30 క్యాలరీస్ ఖర్చవుతాయని చిత్రీకరించారు. తద్వారా ప్రయాణికులు తమ శరీర దారుఢ్యంపై మనసుపెట్టి నడక మార్గాన్ని ఎన్నుకుంటారని అధికారులు ఆశిస్తున్నారు.
రోజురోజుకు పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ప్రయాణికులకు నడక ప్రాముఖ్యతను ఈ విధంగా వివరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.
ఇదీ చూడండి: మెట్రోస్టేషన్లలో అద్దెకు మొబైల్ పవర్‌బ్యాంక్‌లు