ETV Bharat / state

రాష్ట్రంలో తొలి కరోనా మరణం... 67కు పెరిగిన బాధితులు

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 67కు పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ వెల్లడించారు. శనివారం కరోనాతో ఓ వృద్ధుడు మృతిచెందినట్లు నిర్ధరించారు. ఇప్పటి వరకు 10 మంది బాధితులు కోలుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్​జోన్లు ఎక్కడా లేవని... వార్తపత్రికల ద్వారా వైరస్​ వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు.

first corona patient died in telangana
రాష్ట్రంలో తొలి కరోనా మరణం
author img

By

Published : Mar 29, 2020, 5:46 AM IST

రాష్ట్రంలో కరోనాతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆయనలో కరోనా వైరస్‌ ఉన్నట్లు శనివారం నిర్ధరణ అయింది. ఈ వృద్ధుడితో కలిపి శనివారం 8 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వ్యక్తుల సంఖ్య 67కు పెరిగింది. గాంధీఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 10 మందికి పూర్తిగా నయమైంది. మరోసారి పరీక్షలు నిర్వహించి, నెగిటివ్‌ అని తేలితే వారిని ఇళ్లకు పంపిస్తామని మంత్రి ఈటల తెలిపారు.

దిల్లీకి వెళ్లి వచ్చి... అనారోగ్యంతో ఆస్పత్రికి..

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన వృద్ధుడు (76) ఈ నెల 14న దిల్లీ వెళ్లి, 17న నగరానికి వచ్చారు. 20న జ్వరం, శ్వాస సమస్యలతో స్థానికంగా చికిత్స తీసుకున్నాడు. 26న పరిస్థితి విషమించినందున లక్డీకపూల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిమోనియాగా గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగా అదే రోజు రాత్రి మృతి చెందారు. కరోనా లక్షణాలనే అనుమానంతో ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి నమూనాలను సేకరించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా వెల్లడైంది. ఆయన కుటుంబ సభ్యులను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి, విడి గదుల్లో ఉంచారు.

* తాజా బాధితుల్లో శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించే విధుల్లో పాల్గొన్న వైద్యసిబ్బంది, వారి కుటుంబీకులు నలుగురు ఉన్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

ఒక్కరి అశ్రద్ధ.. కుటుంబం మొత్తానికి సమస్య

* కరోనా అనుమానితులు ఇంట్లో విడిగా ఉంటుండక పోవడమే రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని వైద్యవర్గాలు చెబుతున్నాయి. తిరుపతికి వెళ్లొచ్చిన కార్పొరేట్‌ ఆసుపత్రి వైద్యుడు అక్కడ ఓ వైద్య కళాశాలలో విదేశీ వైద్యుడితో భేటీ అయ్యారు. తిరిగి హైదరాబాద్‌ వచ్చి కుటుంబ సభ్యులతో యథావిధిగా గడిపారు. పనిచేస్తున్న ఆసుపత్రికి కూడా కొద్దిసేపు వెళ్లి వచ్చారు. ఫలితంగా ఆ ఇంట్లో ఆ వైద్యుడి భార్యతో పాటు తల్లికి కూడా వైరస్‌ సోకింది.

* ఇటీవల దిల్లీకి వెళ్లొచ్చిన మరో మూడు కుటుంబాల్లోనూ ఇదే తరహాలో వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన కరోనా బాధితుడి కుటుంబంలో నలుగురు, పాతబస్తీ బాధితుని కుటుంబంలో ఏకంగా ఆరుగురు, నాంపల్లిలో కరోనా సోకిన వ్యక్తి కుటుంబంలో నలుగురు చొప్పున వైరస్‌ బారినపడినట్లుగా వైద్యవర్గాలు విశ్లేషించాయి.

* ఒకేచోట గుమిగూడవద్దని ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా.. కొందరు ప్రార్థనా మందిరాల్లో పెద్దసంఖ్యలో గుమిగూడుతుండడంతో వైరస్‌ వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని అధికారులు, మంత్రి ఈటల చెబుతున్నారు.

ఏపీలో ఒక్కరోజే 6 కేసులు... రాష్ట్రంలో 19కి చేరుకున్న కరోనా బాధితులు

ఏపీలో శనివారం ఒక్కరోజే ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటం మొదలైన తర్వాత ఒకే రోజు ఆరు కేసులు రావడం ఇదే ప్రథమం. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 19కి చేరింది. గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశం జిల్లాలో రెండు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం రాత్రి జారీచేసిన బులెటిన్‌ పేర్కొంది. 74 నమూనాలను పరీక్షించగా 68 నెగెటివ్‌ అని వచ్చాయి.

కర్ణాటకలో 75కు చేరిన కేసులు

కర్ణాటకలో కరోనా విస్తృతి ప్రమాదకర స్థాయిలో ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 75కు చేరింది. ఇప్పటికి ఈ వ్యాధితో ముగ్గురు మరణించారు. బుధవారం మరణించిన వృద్ధురాలి (70) ఏడుగురు కుటుంబసభ్యులలో ఐదుగురికి వ్యాధి సోకింది. బెంగళూరులో 41 కేసులు, చిక్కబళ్లాపురలో 9, దక్షిణ కన్నడలో 7, తుమకూరు జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి.

20 రోజుల్లో 1500 పడకలు సిద్ధం:ఈటల

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. యుద్ధప్రాతిపదికన పడకలు, పరికరాలు, ఇతర మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కరుణాకరరెడ్డి, రమేశ్‌రెడ్డి, జి.శ్రీనివాసరావు, టి.గంగాధర్‌, చంద్రశేఖరరెడ్డి తదితరులతో కోఠి వైద్య కార్యాలయంలో శనివారం మంత్రి భేటీ అయ్యారు. గచ్చిబౌలిలోని గేమ్స్‌ విలేజ్‌ భవనాన్ని సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి ఇప్పటివరకూ జరగలేదు. ప్రాణాలు పణంగా పెట్టి వైద్యసిబ్బంది పనిచేస్తున్నారు. వారిపై ఒత్తిడి పడకుండా షిఫ్టుల వారీగా విధులు నిర్వహించేలా ఆదేశాలిచ్చాం. విధుల్లో పాల్గొంటున్న వైద్యసిబ్బందిని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు. రాష్ట్రంలో తొలి మృతుడు దిల్లీ వెళ్లి వచ్చారు. తీవ్ర అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్‌ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. కరోనా చికిత్స అందించే ఆసుపత్రుల్లో ఎటువంటి సమస్యలూ లేవు. ఈ విషయాల్లో తప్పుడు ప్రచారాలు చేయొద్దు. రాష్ట్రంలో రెడ్‌జోన్లు ఎక్కడా లేవు. అటువంటి బోర్డులను తొలగించాలని ఆదేశించాం. కరోనా బాధితుల స్వీయ నిర్బంధం కోసం గచ్చిబౌలి స్టేడియం గేమ్స్‌ విలేజ్‌ భవనంలో 20 రోజుల్లో 1500 పడకలు సిద్ధం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ప్రభుత్వపరంగానే వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నాం’’ అని ఈటల వివరించారు.

కుటుంబసభ్యులకు అంటగడుతున్నారు

కొందరు విదేశాల నుంచి వచ్చి స్వీయ నిర్బంధంలో ఉండకుండా కుటుంబసభ్యులకు అంటగడుతున్నారు. విదేశాల నుంచి నగరానికి వచ్చిన ఓ వ్యక్తి ఆ విషయం చెప్పక పోవడం, జాగ్రత్తలు పాటించకపోవడంతో ఆయన ఇంట్లో ఆరుగురికి వైరస్‌ సోకింది. విమానాశ్రయంలో పనిచేసే ఇద్దరు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో క్వారంటైన్‌లో ఉన్న వారందరూ బాధ్యతగా 14 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలి. ఐసోలేషన్‌లో ఉన్న వారంతా కోలుకుంటున్నారు. అప్పటికే గుండె, మూత్రపిండాలు, రక్తపోటు, మధుమేహం సమస్యలు ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి మాత్రమే కొంత ఆందోళనకరంగా ఉంది

వార్తాపత్రికలతో వైరస్‌ వ్యాప్తి దుష్ప్రచారమే

వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించదు. ప్రచారం కోసం కొందరు సోషల్‌ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఇప్పటికే ప్రభుత్వంతోపాటు పలు వార్తా పత్రికల యాజమాన్యాలు ఖండించాయని మంత్రి ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఇంట్లో గది లేక చెట్టుపై క్వారెంటైన్​ కేంద్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.