Fire Department Annual Report 2023 : రాష్ట్ర విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖ వార్షిక నివేదికను విడుదల చేసింది. నివేదికలో భాగంగా అత్యవసర సేవలను ముందుగా ప్రస్తావించింది. గతేడాదితో పోలిస్తే 2022లో 934 మంది ప్రాణాలు కాపాడితే, 2023లో 2093 మంది ప్రాణాలు కాపాడినట్లు వెల్లడించారు. గతేడాది కంటే ఇది 124 శాతం ఎక్కువని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రాపర్టీ పోలిస్తే గతేడాది రూ,723.14 కోట్ల ప్రాపర్టీ కాపాడితే ఈ సంవత్సరం రూ.918.69 కోట్ల ఆస్తులను కాపాడినట్లు తెలిపారు.
వీటిని గతంతో పోలిస్తే 27 శాతం పెరిగినట్లుగా నివేదిక వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10వేలకు పైగా ప్రజావగాహన కార్యక్రమాలు, 4445 మాక్ డ్రిల్స్, 389 ఆకస్మిక తనిఖీలతో పాటు 2023 ఏప్రిల్‌లో వారం రోజుల పాటు ఫైర్ సర్వీస్ వీక్‌లో భాగంగా 881 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని సంబంధిత శాఖ నివేదికలో పేర్కొంది.
DGP Mahender Reddy : రాష్ట్రంలో 4.65 శాతం నేరాలు పెరిగాయి: డీజీపీ
ఈ ఏడాది మొత్తంగా 6549 నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌లు ఇచ్చామని అందులో ప్రొవిజినల్ ఎన్‌ఓసీ 1160, ఎన్‌ఓసీ ఫర్ ఆక్యుపెన్సీ 404, ఎన్‌ఓసీ రెన్యూవల్ 474, టీఎస్ ఐపాస్ ప్రొవిజినల్ ఎన్‌ఓసీ 13, టీఎస్ ఐపాస్ ఆక్యుపెన్సీ ఎన్‌ఓసీ 03, ఫైర్ క్రాకర్స్ దుకాణలకు 4377 లైసెన్సులుతో పాటు ఫైర్ ఆడిట్‌లు 118 నిర్వహించామని తెలిపారు. దాంతో రూ.36.66 కోట్ల ఆదాయం సమకూరిందని నివేదించారు.
Hyd Police Commissionerate: 'ఇతర నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లో నేరాలు తగ్గుముఖం'
Fire Department Recruitment in 2023: రిక్రూట్మెంట్ విషయానికి వస్తే 610 పోస్టులు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా భర్తీ అయ్యారని, వారితో పాటు 26 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు కూడా రిక్రూట్ అయ్యారని ప్రస్తుతం వారు తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్నారని వెల్లడించింది. అంతేగాక పలు పదోన్నతులు కూడా కల్పించింది. 70మందికి ఫైర్‌మెన్ నుంచి లీడింగ్ ఫైర్‌మెన్‌గా, 17మందికి ఫైర్‌మెన్ నుంచి డ్రైవర్ ఆపరేటర్‌గా, 18 మందికి లీడింగ్ ఫైర్‌మెన్ నుంచి స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా, ఏడుగురికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, మరో ఇద్దరికి జిల్లా ఫైర్ ఆఫీసర్ నుంచి రీజనల్ ఫైర్ అధికారిగా పదోన్నతులు కల్పించినట్లు పేర్కొంది.
Telangana Fire Department : 'ఎలాంటి రెస్క్యూకైనా మేం రెఢీ'.. తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ
ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా 19 ఫైర్ స్టేషన్లు మంజూరు చేసిందని అందులో 8 డబుల్ యూనిట్‌లు కాగా, మరో 11 సింగిల్ యూనిట్లుగా వివరించింది. అంతేగాకుండా పలు అవార్డులు సాధించినట్లు వెల్లడించింది. అందులో 1 ప్రెసిడెంట్ మెడల్, 28 తెలంగాణ అగ్నిమాపక సేవా పథకాలు, 06 ఉత్తమ సేవా పతకాలు, 02 మహోన్నత సేవా పతకాలు 11 తెలంగాణ రాష్ట్ర శౌర్య పతకాలు సాధించినట్లు నివేదికలో పొందుపర్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.32.12 కోట్లు ప్రజాసేవకు వినియోగించామని వెల్లడించారు.
Fire Week In Telangana: వారం రోజులు.. 900లకు పైగా అవగాహన కార్యక్రమాలు