ETV Bharat / state

బన్సీలాల్​పేటలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత - హైదరాబాద్​ వరద బాధితులకు సాయం వార్తలు

భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ. పది వేల ఆర్థిక సహాయాన్ని రంగారెడ్డి జిల్లా బన్సీలాల్​పేటలో తెరాస పార్టీ ఇన్​ఛార్జి గుర్రం పవన్​కుమార్​గౌడ్ అందించారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందని కుటుంబాలను వీలైనంత త్వరగా ఆదుకుంటామని పవన్​ వివరించారు.

financial assistance to flood victims in bansilalpet
బన్సీలాల్​పేటలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత
author img

By

Published : Nov 5, 2020, 6:10 PM IST

తెలంగాణలో కురిసిన అకాల వర్షాలకు అతలాకుతలమైన ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ రూ. పది వేల ఆర్థిక సహాయం అందించేందుకు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా బన్సీలాల్​పేటలో వరద బాధితులకు తెరాస పార్టీ ఇన్​ఛార్జి గుర్రం పవన్​కుమార్​గౌడ్​ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

వరద ముంపునకు గురైన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రూ. 550 కోట్లను యుద్ధప్రాతిపదికన విడుదల చేసిందని పవన్​కుమార్​గౌడ్​ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందని కుటుంబాలు ఇంకా ఉన్నాయని.. వాటిని గుర్తించి వీలైనంత త్వరగా ఆదుకుంటామని ఆయన వివరించారు.

ఇదీ చదవండిః వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: ముఠా గోపాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.