ETV Bharat / state

Rythu bandhu: నెలాఖరుకు యాసంగి రైతుబంధు చెల్లింపులు... సిద్ధమవుతున్న ఆర్థికశాఖ!

author img

By

Published : Dec 12, 2021, 4:56 AM IST

Yasangi rythu bandhu: యాసంగి రైతుబంధు చెల్లింపులు ఈ నెలాఖర్లో జరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా అధికారులు చెల్లింపులకు సిద్ధమవుతున్నారు. యాసంగి సాయంతో రాష్ట్రంలో రైతుబంధు కింద అందించిన మొత్తం రూ. 50 వేల కోట్ల మార్కు దాటనుంది.

Rythu bandhu
Rythu bandhu

Yasangi rythu bandhu: రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని... ముఖ్యమంత్రి కేసీఆర్​ 2018 మేలో ప్రారంభించిన రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు ఏడు పంటలకు పెట్టుబడి సాయం అందింది. మొదట్లో ఎకరాకు ఏడాదికి రూ. 8 వేలు పెట్టుబడి సాయంగా అందించగా... రెండేళ్ల అనంతరం దాన్ని ఎకరాకు రూ. 10 వేలకు పెంచారు. రైతుబంధు కింద 2018-19లో రెండు పంటలకు గాను రూ. 10,488కోట్లు చెల్లింపులు చేశారు. 2019-20లో వానాకాలం, యాసంగి పంటలకు రూ. 10, 532 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఎకరాకు ఏడాదికి 10 వేల రూపాయలు పెంచాక 2020-21లో రెండు పంటల సీజన్లకు కలిపి 14 వేల 656 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

7 విడతల్లో రూ. 43,054 కోట్లకుపైగా సాయం ...

Rythu bandhu Scheme: ఈ ఏడాది వానాకాలం పంటకు సంబంధించి గరిష్ఠంగా 61,08,000 మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయం అందింది. 1.32 కోట్లకు పైగా ఎకరాల భూమికి పెట్టుబడి సాయంగా రూ 7, 377 కోట్ల రైతులకు ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 7 విడతల్లో రూ. 43,054 కోట్లకు పైగా రైతుబంధు సాయంగా అందించింది.

50వేల కోట్ల మార్కు దాటనున్న సాయం. ..

యాసంగి పంటకు సంబంధించి అందరికీ రైతుబంధు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో మాదిరిగానే విస్తీర్ణం ఆధారంగా.... ఈ నెల చివరి వారంలో రైతుబంధు సాయాన్ని అందించనున్నారు. వానాకాలం పంటకు రూ 7, 377 కోట్ల సాయం ఇచ్చిన నేపథ్యంలో ఈ మారు అంతే అవసరం కానుంది. నిధులపై దృష్టిసారించిన ఆర్థికశాఖ.... అవసరమైతే రుణాలు తీసుకుని సిద్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. యాసంగి చెల్లింపులతో రైతుబంధు సాయం రూ. 50వేల కోట్ల మార్కును దాటనుంది.

ఈ నెలాఖరు యాసంగి రైతుబంధు చెల్లింపులు!

ఇదీ చదవండి: Dharmapuri Arvind: తెరాస ఎమ్మెల్యేలు బియ్యం రీసైక్లింగ్ దందాలో ఉన్నారు: ఎంపీ అర్వింద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.