ETV Bharat / state

తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది : హర్షవర్ధన్‌ - హరీశ్​ రావు తాజా వార్తలు

తెలంగాణకు టీకా, ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు కోరారు. రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ నిర్వహించిన సమీక్షలో కేసీఆర్​ ఆదేశాలతో హరీశ్​ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటింటి ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నామని హరీశ్​ రావు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి లాక్​డౌన్ అమలవుతోందని వివరించారు.

కేంద్ర మంత్రి సమీక్షలో పాల్గొన్న హరీశ్​ రావు

author img

By

Published : May 12, 2021, 8:04 PM IST

Updated : May 12, 2021, 8:27 PM IST

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వివిధ రాష్ట్రాలతో కేంద్ర మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు వీడియో కాన్పరెన్స్​లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణా చర్యలను హరీశ్​ రావు వివరించారు. మొదటి వేవ్ కరోనా సందర్భంలో ఉన్న మౌలిక వసతులను రెండో వేవ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందని తెలిపారు.

అప్పుడు కేవలం 18,232 పడకలు మాత్రమే ఉండగా ఇపుడు వాటి సంఖ్య 53,775కి పెరిగిందన్నారు. అంటే మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో... 9,213గా ఉన్న ఆక్సిజన్ పడకలను 20,738కు, ఐసీయూ పడకలను 3,264 నుంచి 11,274కు పెంచిందనట్లు వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటింటి ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నామని.. అంగన్ వాడీ, ఆశావర్కర్లు, ఏఎన్ఎం సిబ్బందితో కూడిన 27,039 బృందాలు ఇంటింటికి వెళ్లి జ్వరపరీక్షలు నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు.

అనుమానితులకు కరోనా నియంత్రిత మందులతో కూడిన హెల్త్ కిట్లను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందన్న మంత్రి... తద్వారా కరోనా సోకిన విషయం పట్ల అవగాహన లేని వారిని గుర్తించి వ్యాప్తి చెందకుండా ముందస్తుగా అడ్డుకోవడం, ఆస్పత్రుల్లో చేరే పరిస్థితి, మరణించే ప్రమాదాల నుంచి కాపాడినట్లవుతుందని తెలిపారు. ఇంటింటి సర్వే సత్ఫలితాలను ఇస్తోందని... ఇప్పటివరకు రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో కోవిడ్ జ్వర పరీక్షలను నిర్వహించి అనుమానితులను ఐసోలేషన్​లో ఉంచి హెల్త్ కిట్లు అందించినట్లు హరీశ్​ రావు వివరించారు.

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి లాక్​డౌన్ అమలవుతోందని కేంద్రమంత్రికి తెలిపారు. రాష్ట్రం తరఫున పలు విజ్జప్తులు చేశారు. తెలంగాణ మెడికల్ హబ్​గా మారిన నేపథ్యంలో స్థానిక కరోనా రోగులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగుల రద్దీ విపరీతంగా పెరిగిందని... మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి పాజిటివ్ వచ్చిన వారు రాష్ట్రానికి వచ్చి చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్​గా నమోదై తెలంగాణకు వచ్చి చికిత్స తీసుకుంటున్న పరిస్థితుల్లో లెక్కల్లో తేడా వస్తోందన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందని హరీశ్​ రావు వివరించారు. రాష్ట్రంలో మందుల కొరత పెరిగేందుకు ఈ తేడా ప్రధాన కారణమని కేంద్ర మంత్రికి వివరించారు.

రాష్ట్రానికి జనాభా ప్రాతిపదికన కాకుండా ఇతర రాష్ట్రాల పాజిటివ్ కేసులను కలిపి, రాష్ట్రంలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసులు, పడకల సంఖ్య ఆధారంగా ఔషధాలు, ఆక్సిజన్, ఇతరాలు కేటాయింపు చేయాలని కేంద్రాన్ని హరీశ్​రావు కోరారు. ఆక్సిజన్​ను 450 మెట్రిక్ టన్నుల నుంచి 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని... ఒడిశా తదితర సుదూర ప్రాంతాల నుంచి కాకుండా దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కేటాయించాలని కోరారు. గతంలో ముఖ్యమంత్రి కోరినట్లు రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను రోజుకు 20 వేలకు పెంచాలని కేంద్ర మంత్రిని మరోమారు హరీశ్​ రావు కోరారు. ఎయిర్ అంబులెన్సుల ద్వారా అత్యవసర చికిత్సకోసం ఇతర ప్రాంతాలనుంచి కరోనా రోగులు తెలంగాణకు తరలి వస్తున్నారని... రాష్ట్రానికి కేవలం 810 మాత్రమే ఇచ్చిన టోసిలీజుమాబ్ మందులను 1,500కు పెంచాలని అన్నారు.

ప్రతిరోజు తెలంగాణకు రెండు లక్షల టెస్టింగ్ కిట్లు అవసరముందని, వాటిని తక్షణమే సరఫరా చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెండో డోస్ టీకా వందశాతం అమలు చేస్తున్నట్లు వివరించారు. 45 ఏళ్లు పైబడిన వారికి టీకాల కోసం 1.29 కోట్ల డోసులు కావాలని, నెలాఖరు వరకు 13 లక్షల తక్షణ అవసరం ఉందని... ఆ మేరకు తక్షణమే సరఫరా చేయాలని కేంద్రమంత్రిని హరీశ్​ రావు కోరారు. 2000 వెంటిలేటర్లు రాష్ట్రానికి అవసరమున్న నేపథ్యంలో తక్షణమే సరఫరా చేయాలని విజ్జప్తి చేశారు.

రాష్ట్ర విజ్జప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్... వివరాలన్నీ నోట్ చేసుకున్నామని, రాష్ట్ర అవసరాలరీత్యా తక్షణమే సరఫరాకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్, రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు, టీకాలు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందులు సామగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: గ్రేటర్​లో లాక్‌డౌన్‌ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు

Last Updated : May 12, 2021, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.