పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలందరిపై ఉందని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అంజన్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లాలాపేట్‌లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
కుర్చీల కోసం కొట్లాట:
తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతుండగా... ఇద్దరు కార్యకర్తల మధ్య కుమ్ములాట జరిగింది. కుర్చీల కోసం తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. కార్యకర్తల వీరంగం చూసిన అంజన్‌కుమార్ యాదవ్‌తో పాటు అక్కడున్న నేతలంతా ఖంగుతిన్నారు. చుట్టుపక్కల ఉన్న వారు ఎంత సముదాయించినా వినకపోవడం వల్ల సభ అర్ధాంతరంగా ముగిసింది.
ఇవీ చూడండి:17 స్థానాలు.. 443 మంది అభ్యర్థులు