సుందరాంగులు తమ సొగసైన హంస నడుకలతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ, వెడ్డింగ్, మోడ్రన్ దుస్తులు ధరించి తమ ఒంపు సొంపులతో ఫ్యాషన్ ప్రియులను మంత్ర ముగ్ధులను చేశారు. ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ మోడల్స్‌చే ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మోడల్స్ విభిన్న వస్త్రాలను ధరించి ర్యాంపై మెరిసిపోయారు. గచ్చిబౌలిలో జరిపిన ఈ వేడుకల్లో సంస్థ డైరెక్టర్లు సిశ్వాంత్, సిమ్రాన్, సాహితీ, సంస్థ ఆర్థిక వ్యవహరాల డైరెక్టర్ సతీష్, ఆజాద్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తదితరులు పాల్గొన్నారు.
యూనిక్ కాల్ సెంటర్, మిస్టర్ బిల్డర్ అనే రెండు సంస్థలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సంస్థ డైరెక్టర్ సిశ్వాంత్ అన్నారు. వ్యాపార ఉద్దేశం కాకుండ సేవా దృక్పథంతో ఈ సంస్థలను స్థాపించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 350 మంది తమ సంస్థలో పని చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : కోటిన్నర మొక్కలు నాటే ఛాలెంజ్‌కు మహేశ్ బాబు మద్దతు