ETV Bharat / state

Crop loss in Telangana: అకాల వర్షాలకు రైతు కుదేలు.. నోటికాడి ముద్ద చేజారిపోయే.. - నిజమాబాద్​లో భారీ వర్షాలు

Heavy rains in Telangana: రూపాయికి రూపాయి కూడబెట్టి.. విత్తుకు, మందుకు అప్పుతెచ్చి.. ఎండనకా వాననకా చెమటోడ్చి.. కంటికి రెప్పలా కాపాడుకున్న కష్టం కళ్లముందే కొట్టుకుపోయింది. గొలుసులేసిన గింజలను చూస్తూ.. కల్లాల్లో నూర్చిన కుప్పలు చూసి.. విరగ్గాసిన చెట్టును చూస్తూ ఎన్నో కలలతో ఎదురుచూస్తున్న అన్నదాతల ఆశలపై అకాల వర్షం ఒక్కసారిగా నీళ్లు చల్లింది. ధాన్యం ఆరబెట్టుకునేందుకు చోటులేక కేంద్రాల్లో కొనుగోళ్లు జరగక.. నోటికాడికొచ్చిన ముద్ద చేజారినట్లైన పరిస్థితుల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

CROP LOSS
CROP LOSS
author img

By

Published : Apr 26, 2023, 3:46 PM IST

Heavy rains in Telangana: రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. తడిసిన ధాన్యం ఆరకముందే వరుసగా కురుస్తున్న వానలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాలకు చాలాచోట్ల ధాన్యం తడిసిపోయింది. అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల వరికోతలు పూర్తై.. కల్లాల్లో ధాన్యం ఉండగా కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలకు తరలించారు. దేవరకద్ర, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్లలో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం వానలకు నానిపోయింది.

కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. దేవరకద్ర, మక్తల్, వనపర్తి, గోపాల్ పేట, పెద్దమందడి, ఖిల్లాఘనపూర్ సహా వివిధ మండలాల్లో కల్లాల్లో రైతులు ఆరబోసుకున్న ధాన్యం సైతం రాత్రి కురిసిన వర్షాలకు తడిసిపోయింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురవడంతో పొల్లాల్లో వడ్లు రాలిపోయాయి. ఈదురు గాలుల ధాటికి వరిచేళ్లు నేలకొరిగాయి.

పిడుగుపాటుకు గేదెలు మృతి: ఐదు జిల్లాల్లో కలిపి ఈసారి సుమారు 5లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. కోతలు 50శాతం పూర్తికాగా, మిగిలిన విస్తీర్ణంలో కోతలు ప్రారంభం కావాల్సి ఉంది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుతో 5 గేదెలు మృతి చెందాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. 10రోజుల్లోనే దాదాపు మూడుసార్లు ముంచెత్తిన వర్షాలతో కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లో ధాన్యం నీటిపాలైంది. కోతలకు సిద్ధంగా ఉన్న వరిపైరు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి నేలవాలింది.

కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సకాలంలో కొనుగోళ్లు జరగ్గా, మిల్లుల కేటాయింపు పూర్తికాకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షంతో జిల్లాలోని పలుమండలాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు అందుబాటులో లేకపోవటంతో ధాన్యం తడిసిపోయింది.

పంట నష్టాన్ని పరిశీలించిన కలెక్టర్​: వరుసగా మూడుసార్లు ఆరబెట్టుకున్న ధాన్యం మళ్లీ తడిసిపోవటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు ధాన్యం పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు చేస్తామని కేంద్రాల్లో నిర్వాహకులు తేల్చిచెబుతుండటంతో రైతులకు మరిన్ని ఇక్కట్లు తప్పటంలేదు. ఖమ్మం జిల్లాలోని పలుమండలాల్లో కలెక్టర్‌ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూధన్‌ పర్యటించారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటామని వారు భరోసానిచ్చారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. హనుమకొండ జిల్లా పరకాలలో ఈదురు గాలులు, వడగండ్ల వాన రైతులను దెబ్బతీసింది. వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. మామిడి, ఇతర కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. తాడ్వాయి మండలం లింగాల రైతులకు చెందిన 10పశువులు పిడుగుపాటుకు గురై మృతిచెందాయి.

Heavy rains in Telangana farmers Losses: భూపాలపల్లి జిల్లాలో దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్‌ నేత గండ్ర సత్యనారాయణ పరిశీలించారు. మొక్కజొన్న, వరి, మామిడి, మిర్చి పంటలను పరిశీలించిన ఆయన నష్టపోయిన రైతులతో మాట్లాడారు. బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకునే వరకు రైతులతో కలిసి కాంగ్రెస్‌ పోరాడుతుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి.

సుద్ధులం, కొరట్‌పల్లి, దుబ్బాక గ్రామాల్లో ఆర్టీసీ ఛైర్మన్‌, స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పర్యటించారు. ఆయా గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించిన బాజిరెడ్డి.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. కామారెడ్డి మండలం లింగాయపల్లి-కోటాలపల్లి రహదారిపై రైతుల రాస్తారోకో చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

నగరంలో రికార్డు స్థాయి వర్షం.. హుస్సేన్​సాగర్​లో తప్పిన ప్రమాదం

వడ్లన్నీ వర్షార్పణం.. లబోదిబోమంటున్న రైతాంగం

అమ్మానాన్న లేరు.. ఆపదలో ఉన్నాం.. ఎవరైనా మమ్మల్ని ఆదుకోండయ్యా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.