ఏపీ ముఖ్యమంత్రి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను రాజధాని అమరావతి పరిధిలోని రైతులు వ్యతిరేకించారు. రేపు అమరావతి ప్రాంతంలో బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం వద్ద రైతులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం బంద్‌తో సరిపెట్టుకోకుండా ప్రభుత్వం దిగి వచ్చేవరకూ వివిధ రకాలుగా తమ ఆందోళన తెలియజేస్తామని రాజధాని ప్రాంత రైతులు చెబుతున్నారు. అవసరమైతే బలిదానానికైనా సిద్ధమన్నారు. ప్రభుత్వ తీరు మారకుంటే ప్రధాని మోదీని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామన్నారు.
ఇవీ చూడండి: 'మతితప్పి పోలీసులపై ఆరోపణలు చేశాం.. క్షమించండి'