Fake Police Aswini in Hyderabad : నగరాల్లో రోజు రోజుకు మోసాలు పెరుగుతున్నాయి. ఎక్కువ శాతం యువతే నేరాలకు పాల్పడుతోంది. జల్సాలకు అలవాటు పడి అడ్డదారులు తొక్కుతోంది. ఎంతటి తప్పుడు పనైనా చేసేందుకు వెనకాడటం లేదు. ఎంతమందిని మోసం చేయాడానికైనా రెడీగా ఉంటున్నారు. ఇలా జల్సాల కోసం కేవలం అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చీటింగ్ చేయడం షురూ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే.. అమ్మాయిల అమాయకత్వం ఈజీగా ఎదుటివారిని బురిడీ కొట్టించేస్తోంది. అందుకే అమ్మాయిలు ఈజీగా మోసం చేయగలుగుతున్నారు.
తాజాగా ఓ యువతి మోసం చేసేందుకు కానిస్టేబుల్ అవతారం ఎత్తింది. కిలేడీ.. కిలాడీగా మారి ఓ యువకుడిని మోసం చేసింది. ఆమె చదివింది ఇంటరే కాని.. మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసింది. పోలీస్ కానిస్టేబుల్ అని యువకుడిని నమ్మించి.. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని అతడి నుంచి డబ్బు తీసుకుంది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. తాను మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆమెను విచారించగా.. అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. : హైదరాబాద్‌లో ఓ యువతి అశ్విని అనే పేరుతో జీవనం సాగిస్తోంది. అదే పేరుతో నకిలీ ఐడీ కార్డును సృష్టించి.. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని పలువురిని నమ్మించింది. ఈ క్రమంలో లంగర్ హౌస్ హరిదాస్పుర బస్తీకి చెందిన నాయక్ అనే యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. అతని దగ్గర రూ.30వేలు వసూలు చేసింది. ఎన్ని రోజులైనా బాధితుడికి ఉద్యోగం రాకపోవడంతో.. ఆ యువకుడు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి విచారించగా.. ఆమె నకిలీ కానిస్టేబుల్ అన్న విషయం బయటపడింది.
fake police: తల్లిని సంతోష పెట్టాలని కానిస్టేబుల్ వేషం.. చివరకు ఏమైందంటే..
Task Force Police Arrested the Fake Constable in Hyderabad : గతంలో ఇదే విధంగానే నకిలీ పోలీసులుగా చలామణి అయిన పలువురు వ్యక్తులను, మరికొన్ని ప్రదేశాల్లో ఏకంగా పోలీస్ స్టేషన్‌ని ఏర్పాటు చేసి.. దందా నడుపుతున్న ముఠాను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగ నియామకాలు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా మాత్రమే జరుగుతాయని.. లంచం ఇవ్వడం వల్ల జరగవని స్పష్టం చేశారు. మోసపోయే వారు ఉన్నంత కాలం.. మోసం చేసేవారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఏ విషయంలోనూ ఎలాంటి వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని సలహా ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులు ఎదురైతే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. డయల్ 100ను ఉపయోగించుకోవాలని చెప్పారు. మోసం చేసే వ్యక్తులకు చట్ట ప్రకారంగా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
ఇవీ చదవండి :