ETV Bharat / state

చాక్​పీస్ పౌడర్‌, మొక్కజొన్న పిండి కాదేదీ ఔషధానికి అనర్హం! - నకిలీ మందుల దందా గుట్టురట్టు - తెలంగాణలో నకిలీ మందుల దందా

Fake Medical Drugs Scam in Telangana : నకిలీ ఔషధాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ప్రముఖ కంపెనీలను పోలిన విధంగా నకిలీ ఔషధాలను తయారు చేస్తున్న కేటుగాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా మెడికల్ షాపులకు చేరవేస్తున్నారు. ఎక్కువ లాభాలు వస్తుండటంతో కొంతమంది మెడికల్ షాపుల యజమానులు, ఆర్​ఎంపీలు వాటిని విక్రయిస్తూ రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. చాక్‌ పీస్ పౌడర్, మొక్కజొన్న పిండితో నకిలీ ఔషధాలు తయారు చేస్తున్నట్లు ఔషధ నియంత్రణ శాఖాధికారుల పరిశీలనలో తేలింది. మరికొన్ని ఔషధాలేమో మోతాదు కంటే అతి తక్కువ రసాయనాలతో తయారు చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.

Fake Medicines Scam in Hyderabad
Fake Medical Drugs Scam in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 10:32 PM IST

నకిలీ మందుల దందా గుట్టురట్టు- యూపీ, ఉత్తరాఖండ్ నుంచి కుప్పలుతెప్పలు​

Fake Medical Drugs Scam in Telangana : ప్రముఖ ఔషధ కంపెనీలకు చెందిన టాబ్లెట్ల మాదిరిగానే ఉన్న నకిలీ మందులను పలు గోదాములు, మెడికల్ షాపులలో ఔషధ నియంత్రం సంస్థ అధికారులు గుర్తించారు. రోగం తగ్గించడానికి ఉపయోగించే యాంటీ బయోటిక్ ఔషధాలతో పాటు క్యాన్సర్ చికిత్స, కరోనా తగ్గించడానికి ఉపయోగించే మందులు, ఇంజక్షన్లలో సైతం నకిలీవి ఉన్నట్లు సంబంధిత అధికారుల పరిశీలనలో తేలింది.

Pradhan Mantri Jan Aushadhi : దేశంలో 10,500 ప్రభుత్వ మందుల దుకాణాలు.. సామాన్యులకు చాలా చౌకగా..

గత కొన్ని నెలలుగా ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన అధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. పక్కా సమాచారం సేకరించి హైదరాబాద్‌ శివార్లలో ఉన్న గోదాంలతో పాటు మెడికల్ షాపులలోనూ దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో పలు విస్మయకర అంశాలు బయటపడ్డాయి. యాంటీబయోటిక్‌గా ఉపయోగించే అమాగ్జిలిన్ ఔషధానికి బదులు పారాసెటమాల్(paracetamol) ఔషధాన్ని వాడినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

Fake Medicines Scam in Hyderabad : పారాసెటమాల్‌ ఔషధాన్ని జ్వరం తగ్గడానికి ఉపయోగిస్తారు. అమాగ్జిలిన్‌ను యాంటీబయోటిక్ ఔషధంగా ఉపయోగిస్తారు. ఒక ఔషధం బదులు మరో ఔషదం ఉపయోగించి నకిలీ ట్లాబ్లెట్లను ఉత్పత్తి చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ ఔషధాలు ఉపయోగించడం వల్ల రోగం తగ్గకపోగా తీవ్రత పెరిగి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముంది. మరికొన్ని ఔషధాల్లో మోతాదు కన్నా తక్కువ రసాయనాలను వాడుతున్నట్లు తేలింది. దీనివల్ల కూడా రోగం తగ్గదు.

Generic Medicine NMC Guidelines : 'ఆ మందులు రాయకుంటే డాక్టర్ల లైసెన్స్​ రద్దు'.. NMC కీలక ఆదేశాలు

ఓ వైద్యుడు రోగ తీవ్రతను బట్టి 500 మిల్లీగ్రాముల డోసు ఉండే ఔషధాలను రాస్తారు. నకిలీ ఔషధాల్లో కేవలం 50 మిల్లీ గ్రాముల డోసు మాత్రమే ఉంటుంది. ఇలాంటి నకిలీ ఔషధాలను వాడినా ఎలాంటి ఫలితం ఉండదు. కరోనా సమయంలో మార్మోగిన రెమ్డెసివిర్ ఇంజక్షన్ సైతం నకిలీవి ఉత్పత్తి చేసినట్లు అధికారులు గుర్తించారు. వాస్తవ ఇంజక్షన్‌తో పోలిస్తే ఎలాంటి మార్పులు లేకుండా నకిలీ ఇంజక్షన్‌ సీసా లెబుల్‌ సైతం రూపొందించారు. క్షూణ్ణంగా పరిశీలిస్తే అసలైన ఇంజక్షన్‌కు, నకిలీకి తేడా గుర్తించే అవకాశం ఉంది.

నకిలీ ఔషధాలను నిర్మూలించే విధంగా ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలోకి నకిలీ ఔషధాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయనే వాటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ నుంచి నకిలీ ఔషధాలు వస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కొరియర్ సంస్థలతో పాటు గోదాములపైనా ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు దాడులు చేశారు.

అధిక కొవ్వు తగ్గించడానికి ఉపయోగించే సన్‌ఫార్మాకు చెందిన ఔషధాలు, రక్తపోటు తగ్గించడానికి ఉపయోగించే గ్లెన్‌మార్క్‌కు చెందిన ఔషధాలను నకిలీవి ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. అరిస్టో, టోరెంట్ కంపెనీలకు చెందిన ఔషధాలు సైతం నకిలీ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారుల దాడుల్లో బయటపడింది. మచ్చబొల్లారంలోని ఓ గోదాంలో దాడులు చేసి క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే నకిలీ ఔషధాలను జప్తు చేశారు. నకిలీ ఔషధాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే టోల్‌ ఫ్రీ నెంబర్ 1800 599 6969కు సమాచారం ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు తెలిపారు. అధిక ధరలకు విక్రయించినా, గడువు తీరిన ఔషధాలు అమ్మినా దగ్గరలో ఉన్న డ్రగ్ ఇన్స్‌పెక్టర్​కు గానీ లేదా టోల్‌ఫ్రీ నెంబర్‌కైనా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

'యునాని వైద్యంలో నూతన ఆవిష్కరణలు, వ్యాపార వృద్ధికి భారీ అవకాశాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.