మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు(Mothkupalli Narsimhulu) మరికాసేపట్లో తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బషీర్ బాగ్ కూడలిలోని మాజీ ఉప ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి, గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి నేరుగా తెలంగాణ భవన్‌కు బయలుదేరారు.

ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే రాష్ట్ర ప్రజలకు మంచి నాయకుడు కావాలని మోత్కుపల్లి(Mothkupalli Narsimhulu) అన్నారు. పేద ప్రజలను ఆదుకునే నాయకుడు కావాలని.. అలాంటి నాయకుడే కేసీఆర్ అని మోత్కుపల్లి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని... కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని ఆయన(Mothkupalli Narsimhulu) అన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు దళితబంధు, రైతుల సంక్షేమం కోసం రైతు బంధు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Ponnala laxmaiah on modi and kcr: 'కేసీఆర్, మోదీల అప్రజాస్వామిక పాలనకు బుద్ధి చెప్పాలి'