ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన అసోంకు చెందిన జాదవ్ మొలాంగ్ హైదరాబాద్లో పర్యటించారు. జాదవ్ అరణ్య భవన్లో అటవీశాఖ అధికారులు, సిబ్బందితో సమావేశమై తన అనుభవాలు పంచుకున్నారు. వర్షాలు, వరదల వల్ల బ్రహ్మపుత్రా నది కోతకు గురై జరుగుతోన్న ప్రకృతి విధ్వంసాన్ని చూసి దాదాపు 550 హెక్టార్లలో ఆయన అడవిని పెంచారు. ఆయన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దేశవ్యాప్తంగా పర్యావరణ ప్రమాద హెచ్చరికలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన... ఉన్న అడవిని కాపాడుకోవడంతోపాటు కొత్తగా అడవులు అభివృద్ధి చేయడం తక్షణ అవసరమని అన్నారు.
ఇదీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు