లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న పేదలకు దాతలు చేయూతనిస్తున్నారు. ఆహారాన్ని, నిత్యావసరాలను పంచి పెడుతూ సాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ అంబర్‌పేటలోని నల్లకుంట డివిజన్లో తెరాస సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. దాదాపు 350 కుటుంబాలకు మూడో విడతగా బియ్యం, కూరగాయలను, ఇతర సరుకులను అందజేశారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్