ED Seized Loan App Company Funds : రుణయాప్‌ల కేసులో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన రూ.288 కోట్లను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేయడాన్ని ఫెమా అధీకృత సంస్థ సమర్థించింంది. రుణయాప్‌లపై మనీలాండరింగ్ అభియోగాలను దర్యాప్తు చేస్తున్న ఈడీ.. పీసీఎఫ్ఎస్ కంపెనీ ఫెమా నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు గుర్తించింది.
ఫెమా కింద మరో కేసు నమోదు చేసి 288 కోట్ల రూపాయలను జప్తు చేసింది. ఈడీ ఉత్తర్వలను చెన్నైలోని ఫెమా అధీకృత సంస్థ ధ్రువీకరించింది. క్వాష్ బిన్ మొబైల్ యాప్ ద్వారా ఆర్బీఐ అనుమతి లేకుండా అధిక వడ్డీలతో అప్పులు ఇచ్చి.. రుణగ్రహీతలను వేధించినట్లు పీసీఎఫ్ఎస్పై ఈడీ అభియోగం. పీసీఎఫ్ఎస్ చెన్నై జాతీయుల అధీనంలో ఉన్నట్లు ఈడీ పేర్కొంది.
ఇదీ చూడండి : Forum for Good Governance: ఆ విషయంపై గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి లేఖ..