పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న సిఫారసను నిరసిస్తూ.. ఉపాధ్యాయుల ఐక్య వేదిక జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. పీఆర్సీ ప్రతులు చింపివేసిన ఐక్య వేదిక ప్రతినిధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఐక్య వేదిక ప్రతినిధులను అడ్డుకుని అరెస్టు చేశారు.
ఉద్యోగసంఘాల నిరసన పిలుపుతో సచివాలయ భవనంగా విధులు నిర్వర్తిస్తున్న బీఆర్కే భవన్ పరిసరాల్లో పోలీసు అదనపు బలగాలను మోహరించారు.